తెలంగాణలో టీడీపీ దాదాపు క్లోజ్‌, గెలుపు టీఆర్‌ఎస్‌దే " టైమ్స్ నౌ సర్వే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అని మరో సర్వే తేల్చింది. టైమ్స్ నౌ- సీఎన్‌ఎక్స్‌ సర్వేలో టీఆర్ఎస్‌కు మహాకూటమి దరిదాపుల్లో కూడా లేదు. అయితే టీఆర్ఎస్‌ చెబుతున్నట్టు వంద సీట్లు అయితే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సొంతంగా 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని టౌమ్స్‌ నౌ- సీఎన్‌ఎక్స్ సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌కు 31 స్థానాలు వస్తాయని వెల్లడించింది. టీడీపీ మూలాలు తెలంగాణలో కదిలిపోయినట్టుగానే ఉంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న […]

Advertisement
Update:2018-11-23 17:04 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపు అని మరో సర్వే తేల్చింది. టైమ్స్ నౌ- సీఎన్‌ఎక్స్‌ సర్వేలో టీఆర్ఎస్‌కు మహాకూటమి దరిదాపుల్లో కూడా లేదు. అయితే టీఆర్ఎస్‌ చెబుతున్నట్టు వంద సీట్లు అయితే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సొంతంగా 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని టౌమ్స్‌ నౌ- సీఎన్‌ఎక్స్ సర్వే చెబుతోంది. కాంగ్రెస్‌కు 31 స్థానాలు వస్తాయని వెల్లడించింది. టీడీపీ మూలాలు తెలంగాణలో కదిలిపోయినట్టుగానే ఉంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న టీడీపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

ఎంఐఎం ఎనిమిది స్థానాల్లో గెలవనుంది. బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే చాన్స్ ఉంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలవొచ్చని సర్వే వెల్లడించింది. 2014తో పోలిస్తే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగింది. 2014లో టీఆర్‌ఎస్‌కు 63 స్థానాలు రాగా… ఈసారి ఏడు స్థానాల్లో అదనంగా టీఆర్‌ఎస్ గెలవనుంది.

కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలవగా ఈసారి పుంజుకుని 31 స్థానాలకు చేరుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు అదనంగా సీట్లు వస్తుండగా… టీడీపీ ఘోరంగా దెబ్బతిని పోయింది. 2014 ఎన్నికల్లో 15 చోట్ల గెలిచిన ఆ పార్టీ ఈసారి కేవలం రెండు స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే తేల్చింది.

బీజేపీ కూడా గతంతో పోలిస్తే రెండు స్థానాలు కోల్పోతోంది. ఎంఐఎం మాత్రం ఒక స్థానాన్ని అదనంగా గెలుచుకునే చాన్స్‌ ఉందని టైమ్స్ నౌ సర్వే చెబుతోంది. మహాకూటమి ప్రయోగం వికటించిందని సర్వే వెల్లడించింది. టీడీపీ, బీజేపీ కోల్పోయిన సీట్లు ఈసారి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఖాతాలోకి పడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News