అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో "సై రా నరసింహారెడ్డి".

మెగా స్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. ఈ సినిమా లో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడు అనే రూమర్స్ ఇది వరకు ఇండస్ట్రీ లో వినిపించాయి. కానీ ఈ అర్జున్ కనిపించడు.. కేవలం వినిపిస్తాడట. అవును ఈ సినిమాకి అల్లు అరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాణంలో మెగా డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న “సైరా నరసింహారెడ్డి” వాయిస్‌ ఓవర్‌తో మొదలయ్యే చిత్రమని తెలుస్తోంది. […]

Advertisement
Update: 2018-11-21 06:00 GMT

మెగా స్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. ఈ సినిమా లో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడు అనే రూమర్స్ ఇది వరకు ఇండస్ట్రీ లో వినిపించాయి. కానీ ఈ అర్జున్ కనిపించడు.. కేవలం వినిపిస్తాడట. అవును ఈ సినిమాకి అల్లు అరుణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాణంలో మెగా డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న “సైరా నరసింహారెడ్డి” వాయిస్‌ ఓవర్‌తో మొదలయ్యే చిత్రమని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుతో పాటు, ఇతర భాషలకు చెందిన హేమా హేమీ నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాంటి ఈ మెగా ప్రాజెక్ట్‌కి అల్లు అర్జున్‌ గొంతు ఖచ్చితంగా ప్లస్‌ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా తర్వాత బన్నీ కొత్త చిత్రం ఇంతవరకూ ఏదీ ప్రకటించలేదు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో బన్నీ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ దీని పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే ఏడాది అల్లు అర్జున్ తో ఈ వాయిస్ ఓవర్ చెప్పించనున్నారు సినిమా యూనిట్.

Tags:    
Advertisement

Similar News