మహేష్ బాబు తో నటించే ఛాన్స్ కోల్పోయిన హీరోయిన్

యంగ్ హీరోయిన్ మేహ్రిన్ కి తెలుగు లో ఇప్పుడిప్పుడే క్రేజ్ వస్తుంది. తెలుగు లో ఈమెకి జూనియర్ కాజల్ అగర్వాల్ అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో “కవచం” అనే సినిమాలో నటిస్తుంది మేహ్రిన్. అయితే ఇప్పటి వరకు కేవలం యంగ్ హీరోస్ తో మాత్రమే నటించిన మేహ్రిన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ మేహ్రిన్ మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా […]

Advertisement
Update: 2018-11-19 23:19 GMT

యంగ్ హీరోయిన్ మేహ్రిన్ కి తెలుగు లో ఇప్పుడిప్పుడే క్రేజ్ వస్తుంది. తెలుగు లో ఈమెకి జూనియర్ కాజల్ అగర్వాల్ అనే పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో “కవచం” అనే సినిమాలో నటిస్తుంది మేహ్రిన్. అయితే ఇప్పటి వరకు కేవలం యంగ్ హీరోస్ తో మాత్రమే నటించిన మేహ్రిన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ మేహ్రిన్ మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట.

మొదట ఆఫర్ వచ్చినప్పుడు మేహ్రిన్ ఎగిరి గెంతేసినా, కానీ డేట్స్ అడిగినప్పుడు మాత్రం కుదరలేదట. అందుకే మహేష్ బాబు పక్కన నటించే గోల్డెన్ ఆఫర్ ని రిజెక్ట్ చెసింది మేహ్రిన్. ఇప్పుడు ఇదే ఆఫర్ బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కి వెళ్ళింది. “మహర్షి” సినిమాలో ఇప్పుడు సోనాల్ చౌహాన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Tags:    
Advertisement

Similar News