రకుల్ ప్రీత్ సింగ్ హర్ట్ అయ్యింది

ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే “స్పైడర్” సినిమా తరువాత రకుల్ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చెయ్యలేదు. ఎక్కువగా తమిళ్, హిందీ సినిమాలు మాత్రమే ఓకే చేస్తుంది ఈ భామ. అయితే రకుల్ ఇలా చేస్తున్నందుకు తెలుగు అభిమానులు రకుల్ పై సీరియస్ గా ఉన్నారు. ఇంత స్టార్ డం తెచ్చిన తెలుగు సినిమాలని ఎలా మర్చిపోతావ్ అంటూ రకుల్ […]

Advertisement
Update: 2018-11-18 22:16 GMT

ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే “స్పైడర్” సినిమా తరువాత రకుల్ ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చెయ్యలేదు.

ఎక్కువగా తమిళ్, హిందీ సినిమాలు మాత్రమే ఓకే చేస్తుంది ఈ భామ. అయితే రకుల్ ఇలా చేస్తున్నందుకు తెలుగు అభిమానులు రకుల్ పై సీరియస్ గా ఉన్నారు. ఇంత స్టార్ డం తెచ్చిన తెలుగు సినిమాలని ఎలా మర్చిపోతావ్ అంటూ రకుల్ ని తిడుతున్నారు.

అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో రకుల్ దీని పై స్పందిస్తూ “నాకు ఎక్కువ పేరు తెచ్చింది తెలుగు ఇండస్ట్రీ నే, హైదరాబాద్ అనేది నాకు ఇల్లు లాంటిది. అలాంటి తెలుగు ఇండస్ట్రీ ని నేను ఎలా మరిచిపోతాను. నా అభిమానులే నన్ను ఇలా వేరు చెయ్యడం నన్ను బాగా హర్ట్ చేసింది” అంటూ ఫీల్ అయ్యింది రకుల్ ప్రీత్.

అలాగే తన చేతిలో ప్రస్తుతం నాగ చైతన్య సినిమాతో పాటు ఇతర బాషల సినిమాలు అన్ని కలిపి మొత్తం 7 సినిమాలు లైన్ లో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అన్ని సినిమాలు ఒప్పుకోవాలని ఉంది కానీ… డేట్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పుకొచ్చింది ఈ భామ.

Tags:    
Advertisement

Similar News