"న్యూస్‌ జే" చానల్‌ ప్రారంభం

తమిళనాడులో మరో కొత్త చానల్‌ ప్రారంభం కాబోతోంది. అన్నాడీఎంకే పార్టీ కోసం ఈ చానల్‌ బుధవారం సాయంత్రం ప్రారంభం కాబోతోంది. న్యూస్‌ జే పేరుతో చానల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చేతుల మీదుగా చానల్‌ను ప్రారంభం కాబోతోంది. గతంలో జయలలిత బతికి ఉన్న సమయంలో అన్నాడీఎంకే కి జయ టీవీ పనిచేసేది. సమదు ఎంజీఆర్ దినపత్రిక కూడా ఉండేది. అయితే ఇవి శశికళ కుటుంబం చేతుల్లో నడిచాయి. జయ మృతి […]

Advertisement
Update: 2018-11-13 21:26 GMT

తమిళనాడులో మరో కొత్త చానల్‌ ప్రారంభం కాబోతోంది. అన్నాడీఎంకే పార్టీ కోసం ఈ చానల్‌ బుధవారం సాయంత్రం ప్రారంభం కాబోతోంది. న్యూస్‌ జే పేరుతో చానల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చేతుల మీదుగా చానల్‌ను ప్రారంభం కాబోతోంది.

గతంలో జయలలిత బతికి ఉన్న సమయంలో అన్నాడీఎంకే కి జయ టీవీ పనిచేసేది. సమదు ఎంజీఆర్ దినపత్రిక కూడా ఉండేది. అయితే ఇవి శశికళ కుటుంబం చేతుల్లో నడిచాయి.

జయ మృతి తర్వాత శశికళ అన్నాడీఎంకేకు దూరం కావడంతో చానల్‌, పత్రిక కూడా పార్టీకి దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో తమకంటూ పత్రిక, చానల్‌ అవసరమని భావించిన అన్నాడీఎంకే నాయకత్వం… ఫిబ్రవరిలోనే ”సమదు అమ్మ” పేరుతో పత్రికను ప్రారంభించింది.

టీవీ చానల్‌ కూడా తీసుకొస్తామని గతంలో ప్రకటించిన విధంగానే ఇప్పుడు న్యూస్‌ జేను ప్రారంభిస్తున్నారు. ఈచానల్‌ నిర్వాహణ డైరెక్టర్‌గా న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సోదరుడు సీవీ రాధాకృష్ణన్‌ వ్యవహరిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News