గోదావరి జిల్లాల్లో హవా.... జగన్, పవన్‌లదేనా? బాబు చిత్తేనా?

ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ పరిస్థితి గురించి ఒక సర్వే వైరల్ గా మారింది. ఒక అధ్యయన సంస్థ చేసిన ఈ సర్వేలో…. ఆ రెండు జిల్లాల్లో టీడీపీ చిత్తు అవుతుందని తేలిందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ సర్వే వైరల్ అవుతోంది. రాష్ట్రంలోనే ఎక్కువ సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంటాయి. ఇలాంటి జిల్లాల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ సొంత పార్టీ కార్యకలాపాలను మొదలుపెట్టాక […]

Advertisement
Update: 2018-11-11 00:26 GMT

ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ పరిస్థితి గురించి ఒక సర్వే వైరల్ గా మారింది. ఒక అధ్యయన సంస్థ చేసిన ఈ సర్వేలో…. ఆ రెండు జిల్లాల్లో టీడీపీ చిత్తు అవుతుందని తేలిందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ సర్వే వైరల్ అవుతోంది.

రాష్ట్రంలోనే ఎక్కువ సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంటాయి. ఇలాంటి జిల్లాల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ సొంత పార్టీ కార్యకలాపాలను మొదలుపెట్టాక కాపులు అటువైపు అట్రాక్ట్ అయ్యారని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా కాకపోయినా…. మెజారిటీ కాపులు పవన్ వైపు నిలవవచ్చు.

ఇక ఇతర వర్గాల్లో కూడా టీడీపీపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం చిత్తు అవుతుందని అంటున్నారు. అందుకు ఊతంగా నిలుస్తోంది ఈ సర్వే.

దీని ప్రకారం…. ఆ రెండు జిల్లాల్లో కలిపి టీడీపీ కేవలం మూడంటే మూడు సీట్లకే పరిమితం అవుతుందని అంటున్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేనలు వేర్వేరుగా పోటీ చేస్తే…. తెలుగుదేశం చిత్తు అవుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది.

ఇక మెజారిటీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని, జనసేన 15 ఎమ్మెల్యే సీట్లను నెగ్గవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.

వైసీపీ, జనసేనలు ఆ రెండు జిల్లాల్లో ఈ మాత్రం సీట్లను సాధిస్తే వాటికి హ్యాపీనే. ఎలాగూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి మెజారిటీ ఉంటుంది. ఇక గుంటూరు, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ మంచి స్థాయిలో సీట్లను సాధించుకునే అవకాశం ఉంది. గోదావరి జిల్లాల్లో 16 సీట్లే వస్తే జగన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను సునాయాసంగా అందుకునే అవకాశాలున్నాయి.

Advertisement

Similar News