బన్నీ సరసన రామ్ చరణ్ బ్యూటీ

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తోంది కైరా అద్వానీ. ఈ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి ఎంటరైన ఈ బ్యూటీ, వెంటనే అదే కాంపౌండ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది. మొదట చెర్రీ ఈమెకు ఛాన్స్ ఇస్తే, ఈసారి బన్నీ వంతు. అవును.. తన నెక్ట్స్ ప్రాజెక్టులో కైరాను తీసుకునేందుకు తహతహలాడుతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ, దర్శకుడు త్రివిక్రమ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఓ హిందీ సినిమా నలుగుతోంది. […]

Advertisement
Update: 2018-11-01 19:51 GMT

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తోంది కైరా అద్వానీ. ఈ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి ఎంటరైన ఈ బ్యూటీ, వెంటనే అదే కాంపౌండ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది. మొదట చెర్రీ ఈమెకు ఛాన్స్ ఇస్తే, ఈసారి బన్నీ వంతు. అవును.. తన నెక్ట్స్ ప్రాజెక్టులో కైరాను తీసుకునేందుకు తహతహలాడుతున్నాడు అల్లు అర్జున్.

ప్రస్తుతం బన్నీ, దర్శకుడు త్రివిక్రమ్ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఓ హిందీ సినిమా నలుగుతోంది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలా, లేక ఓ ఫ్రెష్ సబ్జెక్ట్ తో సెట్స్ పైకి వెళ్లాలా అనే పాయింట్ దగ్గర ఆగిపోయారు. కథ ఏదైనా, అందులో హీరోయిన్ గా కైరా దాదాపు ఫిక్స్.

ఈ మేరకు కైరాతో మెగా కాంపౌండ్ కు చెందిన కొందరు వ్యక్తులు సంప్రదింపులు జరిపారు. త్వరలోనే కథతో వచ్చి కలుస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కైరా, తనకు పరిచయమైన హిందీ మీడియా ఫ్రెండ్స్ కు చెప్పడంతో, ఈ మేటర్ బయటకు పొక్కింది.

Tags:    
Advertisement

Similar News