బన్నీ-త్రివిక్రమ్.. ఓ రీమేక్ సినిమా

నా పేరు సూర్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఎట్టకేలకు కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. విక్రమ్ కుమార్ ను పక్కనపెట్టి మరీ త్రివిక్రమ్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. అలా బన్నీ-త్రివిక్రమ్ కాంబో మరోసారి సెట్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 11న సినిమా లాంచ్ అవుతుంది. బన్నీ-త్రివిక్రమ్ కాంబో జనాలకు కొత్తకాదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి 2 సినిమాలు చేశారు. ఈసారి ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే.. […]

Advertisement
Update: 2018-10-27 23:07 GMT

నా పేరు సూర్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఎట్టకేలకు కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. విక్రమ్ కుమార్ ను పక్కనపెట్టి మరీ త్రివిక్రమ్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. అలా బన్నీ-త్రివిక్రమ్ కాంబో మరోసారి సెట్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 11న సినిమా లాంచ్ అవుతుంది.

బన్నీ-త్రివిక్రమ్ కాంబో జనాలకు కొత్తకాదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి 2 సినిమాలు చేశారు. ఈసారి ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే.. బన్నీ-త్రివిక్రమ్ కలిసి ఈసారి ఓ రీమేక్ ప్రాజెక్టు చేయబోతున్నారు. అవును.. హిందీలో హిట్ అయిన ఓ సినిమాను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. ఆ ప్రాజెక్టును త్రివిక్రమ్ చేతిలో పెట్టాడు.

రీమేక్ ను డైరక్ట్ చేసిన అనుభవం త్రివిక్రమ్ కు లేదు. కానీ రీమేక్ సినిమాకు మాటలు అందించిన అనుభవం మాత్రం ఉంది. గతంలో పవన్ చేసిన తీన్ మార్ అనే రీమేక్ సినిమాకు త్రివిక్రమే మాటలు అందించాడు. ఇప్పుడు ఏకంగా రీమేక్ సబ్జెక్ట్ ను డైరక్ట్ చేయబోతున్నాడు.

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఆ రీమేక్ సినిమా ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ సినిమా రీమేక్ రైట్స్ మాత్రం టీ-సిరీస్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News