జగన్‌పై దాడి.... గవర్నర్‌ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది. సెల్పీ తీసుకుంటానని వచ్చిన శ్రీనివాస్‌ అనే యువకుడు జగన్‌పై కోడి పందాల కత్తితో ఒక్కసారిగా దాడి చేశారు. అయితే జగన్‌ మెరుపువేగంగా అప్రమత్తం అయి అతడిని పక్కకు లాగారు. దీంతో జగన్‌ మెడపై పొడవాలనుకున్న శ్రీనివాస్‌ ప్రయత్నం విఫలమైంది. కత్తిపోటు జగన్ భుజంలోకి దిగింది. జగన్‌పై దాడి ఏపీలో సంచలనం సృష్టించింది. పోలీసు యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాటర్‌ బాటిల్‌ […]

Advertisement
Update: 2018-10-25 03:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగింది. సెల్పీ తీసుకుంటానని వచ్చిన శ్రీనివాస్‌ అనే యువకుడు జగన్‌పై కోడి పందాల కత్తితో ఒక్కసారిగా దాడి చేశారు.

అయితే జగన్‌ మెరుపువేగంగా అప్రమత్తం అయి అతడిని పక్కకు లాగారు. దీంతో జగన్‌ మెడపై పొడవాలనుకున్న శ్రీనివాస్‌ ప్రయత్నం విఫలమైంది. కత్తిపోటు జగన్ భుజంలోకి దిగింది. జగన్‌పై దాడి ఏపీలో సంచలనం సృష్టించింది. పోలీసు యంత్రాంగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వాటర్‌ బాటిల్‌ తీసుకు వెళ్ళడానికి కూడా అనుమతి లేని చోటికి ఏకంగా ఒక వ్యక్తి కత్తితో ఎలా రాగలిగారని ప్రశ్నలు వస్తున్నాయి. వైఎస్‌ జగన్‌పై దాడిని పలువురు ఖండించారు. జగన్‌పై హత్యాయత్నం గురించి తెలుసుకున్న గవర్నర్ నరసింహన్‌ తీవ్రంగా స్పందించారు. ఏపీ డీజీపీకి ఫోన్ చేశారు.

అసలు ఏపీలో ఏం జరుగుతోందని నిలదీశారు. వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిపక్షనాయకుడికి భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారని గవర్నర్ సీరియస్ అయ్యారు. జగన్‌పై దాడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.

జగన్‌పై దాడి వెనుక అధికార పార్టీ కుట్ర ఉందన్న అనుమానాన్ని ఎమ్మెల్యే రోజా వ్యక్తం చేశారు. కత్తికి విషం పూసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జగన్‌ ఒక్కడిని అడ్డుతొలగించుకుంటే తిరుగుండదన్న భావన కూడా టీడీపీలో ఉందన్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకులకు భద్రత తగ్గించారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక టీడీపీ నేత ద్వారానే దాడి చేసిన నిందితుడు ఎయిర్‌పోర్టులోని హోటల్‌ లో చేరినట్టు తెలుస్తోందన్నారు.

Tags:    
Advertisement

Similar News