రామ్ చరణ్ పై కోపంగా ఉన్న బోయపాటి శ్రీను ?

ఈ ఏడాది “రంగస్థలం” సినిమాతో రామ్ చరణ్ నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ కి మంచి పేరు వచ్చింది. అయితే ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ తనకి వచ్చిన పేరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అందుకే రామ్ చరణ్ బోయపాటి శ్రీను సినిమాపై ఎక్కువ ద్రుష్టి పెట్టాలి అని రామ్ చరణ్ సన్నిహితులు అంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అలా చెయ్యడం లేదు. చరణ్ వలన ఈ సినిమా షూటింగ్ కి అప్పుడప్పుడు […]

Advertisement
Update: 2018-10-21 23:03 GMT

ఈ ఏడాది “రంగస్థలం” సినిమాతో రామ్ చరణ్ నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ కి మంచి పేరు వచ్చింది. అయితే ఇలాంటి సమయంలోనే రామ్ చరణ్ తనకి వచ్చిన పేరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అందుకే రామ్ చరణ్ బోయపాటి శ్రీను సినిమాపై ఎక్కువ ద్రుష్టి పెట్టాలి అని రామ్ చరణ్ సన్నిహితులు అంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అలా చెయ్యడం లేదు. చరణ్ వలన ఈ సినిమా షూటింగ్ కి అప్పుడప్పుడు అంతరాయం ఏర్పడుతుందని ఇన్ సైడ్ టాక్.

చెప్పిన టైం కి షూటింగ్ కి రావడం లేదని, సెట్ లో అందరు రెడీగా ఉన్నానేను ఈరోజు రావడం లేదు అని సడన్ గా ఫోన్ చేసి చెబుతున్నాడని, దాంతో చరణ్ వలన షూటింగ్ కి పేకప్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ దృష్టంతా “సైరా” సినిమాపై పడిందని, ఆ సినిమా విషయంలో దృష్టి పెట్టడంతో, ఆ బిజీలోనే బోయపాటి సినిమాని లైట్ తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. ఒక్క రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందంటే చాలు నిర్మాతపై ఆర్ధికంగా భారం పడుతుంది. రామ్ చరణ్ కి ఈ విషయం తెలిసిన కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడో మరి.

Tags:    
Advertisement

Similar News