కూతురు శవాన్ని భుజానేసుకుని 8 కి.మీ నడక..

భారత్‌ వెలిగిపోతోంది.. మోడీ కేర్‌ కూడా వచ్చేసింది.. కానీ ఇది కేవలం ప్రచారం మాత్రమే అని రుజువు చేసే సంఘటన ఇది. ఇంకా మన పల్లెల్లో కనీస వైద్య సదుపాయాలు లేవు. రవాణా సదుపాయాలూ లేవు. తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ తండ్రి తన కూతురు శవాన్ని భుజాన వేసుకుని 8 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. తుపాను కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడేళ్ల కూతురు చనిపోయింది. ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి […]

Advertisement
Update: 2018-10-18 22:34 GMT

భారత్‌ వెలిగిపోతోంది.. మోడీ కేర్‌ కూడా వచ్చేసింది.. కానీ ఇది కేవలం ప్రచారం మాత్రమే అని రుజువు చేసే సంఘటన ఇది. ఇంకా మన పల్లెల్లో కనీస వైద్య సదుపాయాలు లేవు. రవాణా సదుపాయాలూ లేవు. తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ తండ్రి తన కూతురు శవాన్ని భుజాన వేసుకుని 8 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది.

తుపాను కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడేళ్ల కూతురు చనిపోయింది. ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండడం, ఏ సదుపాయాలూ లేకపోవడంతో 8 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. 2016లో ఓ వ్యక్తి తన భార్య శవాన్ని మోసుకుంటూ 10 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటనను ఇది మరోమారు గుర్తు చేసిందంటూ స్థానిక చానళ్లు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. గజపతి జిల్లాలోని ఆతంక్‌పూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Tags:    
Advertisement

Similar News