ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకుడు శంకరన్‌ ఆత్మహత్య

దక్షణ భారతదేశంలోనే సివిల్స్‌ కోచింగ్‌లో పేరుగాంచిన సంస్థగా శంకరన్‌ ఐఏఎస్ అకాడమి ఉంది. అయితే ఈ అకాడమీ వ్యవస్థాపకుడు శంకరన్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైతో పాటు పలు రాష్ట్రాల్లో అకాడమీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి వేలాది మందికి సివిల్స్‌ పరీక్షలకు ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది. అయితే శంకరన్‌ కుటుంబ కలహాలతో కొద్దికాలంగా ఇబ్బందిపడుతున్నారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శంకరన్‌ పై అనుమానంతో ఆయన భార్య పదేపదే నిలదీస్తూ ఉండేదని సమాచారం. ఈ నేపథ్యంలో […]

Advertisement
Update: 2018-10-13 01:54 GMT

దక్షణ భారతదేశంలోనే సివిల్స్‌ కోచింగ్‌లో పేరుగాంచిన సంస్థగా శంకరన్‌ ఐఏఎస్ అకాడమి ఉంది. అయితే ఈ అకాడమీ వ్యవస్థాపకుడు శంకరన్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైతో పాటు పలు రాష్ట్రాల్లో అకాడమీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి వేలాది మందికి సివిల్స్‌ పరీక్షలకు ఈ సంస్థ శిక్షణ ఇస్తోంది. అయితే శంకరన్‌ కుటుంబ కలహాలతో కొద్దికాలంగా ఇబ్బందిపడుతున్నారు.

భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శంకరన్‌ పై అనుమానంతో ఆయన భార్య పదేపదే నిలదీస్తూ ఉండేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాత్రి ఇంటికి వచ్చిన శంకరన్‌కు భార్యకు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో నేరుగా పై అంతస్తుకు వెళ్లి గదిలో తలుపులేసుకున్నారు. ఎంతకీ రాకపోవడంతో భార్య ఫోన్‌ చేసినా తీయలేదు. కుటుంబసభ్యులు బలవంతంగా తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు.

భార్యతో గొడవలతో పాటు ఇటీవల సివిల్స్‌ కోచింగ్ సెంటర్ల మధ్య పెరిగిన పోటీ కూడా శంకరన్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టినట్టు చెబుతున్నారు. శంకరన్ ఐఏఎస్‌ అకాడమీలో శిక్షణ పొందిన వారిలో 900 మందికి పైగా ప్రభుత్వ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇతని అకాడమీలో 15 వందల మంది శిక్షణ పొందుతున్నారు. శంకరన్‌ ఆత్మహత్యతో అకాడమి పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News