వైసీపీ నేత కేశవ రెడ్డి హత్య.... పరిటాల పై ఆరోపణలు

అనంతపురం జిల్లాలో మరో ఫ్యాక్షన్‌ హత్య జరిగింది. వైసీపీ నేత కేశవరెడ్డిని టీడీపీ వర్గీయులు నరికి చంపారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో ఈ హత్య జరిగింది. వైసీపీ నేత కేశవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో మాటు వేసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లు, రాడ్లతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న కేశవరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గినా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో మాత్రం […]

Advertisement
Update: 2018-10-10 01:40 GMT

అనంతపురం జిల్లాలో మరో ఫ్యాక్షన్‌ హత్య జరిగింది. వైసీపీ నేత కేశవరెడ్డిని టీడీపీ వర్గీయులు నరికి చంపారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో ఈ హత్య జరిగింది. వైసీపీ నేత కేశవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో మాటు వేసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లు, రాడ్లతో దాడి చేశారు.

కొన ఊపిరితో ఉన్న కేశవరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గినా మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో మాత్రం పదేపదే వైసీపీ నేతల హత్యలు జరుగుతున్నాయి. కేశవరెడ్డి హత్య వెనుక పరిటాల కుటుంబం హస్తముందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కొంతకాలంగా కేశవరెడ్డికి అతడి బంధువు నరసింహారెడ్డికి మధ్య భూతగాదా నడుస్తోంది. నరసింహారెడ్డికి పరిటాల కుటుంబం అండ ఉంది. వైసీపీ నేత కేశవరెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు నరసింహారెడ్డిని ఉసిగొల్పి హత్య చేయించారని పరిటాల కుటుంబంపై కేశవరెడ్డి కుటుంబం ఆరోపణలు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News