తెలంగాణ ఓటర్ల జాబితాపై హైకోర్టు స్టే

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, తుది జాబితా విడుదల అంశాలపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈనెల 8న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతున్న వేళ…. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేడు పిటిషన్లు విచారించిన హైకోర్టు…. తుది జాబితా విడుదలపై స్టే ఇచ్చింది. ఈనెల 8న కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ రిట్ పిటిషన్‌కు లోబడే ప్రకటించాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత […]

Advertisement
Update: 2018-10-05 06:15 GMT

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, తుది జాబితా విడుదల అంశాలపై హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఈనెల 8న ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు ఈసీ సిద్ధమవుతున్న వేళ…. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేడు పిటిషన్లు విచారించిన హైకోర్టు…. తుది జాబితా విడుదలపై స్టే ఇచ్చింది.

ఈనెల 8న కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ రిట్ పిటిషన్‌కు లోబడే ప్రకటించాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై దాఖలైన మరో రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Tags:    
Advertisement

Similar News