గండ్ర ఎఫైర్‌.... మహిళను చితకబాదిన కాంగ్రెస్ కార్యకర్తలు

భూపాలపల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఎన్నికల వేళ ఒక మహిళ వెంటాడుతుంది. గండ్ర వెంకటరమణారెడ్డి తనను లైంగికంగా వాడుకుని మోసం చేశారంటూ విజయలక్ష్మీ అనే మహిళ కొద్దిరోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా తనను గండ్ర లైంగికంగా వాడుకున్నారని ఇప్పుడు ముఖం చాటేశాడని ఆరోపించారు. కేసు కూడా పెట్టింది ఆమె. అయితే ఆమె మరోసారి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగే ప్రయత్నం చేసింది. అయితే అక్కడే […]

Advertisement
Update: 2018-10-04 04:48 GMT

భూపాలపల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఎన్నికల వేళ ఒక మహిళ వెంటాడుతుంది. గండ్ర వెంకటరమణారెడ్డి తనను లైంగికంగా వాడుకుని మోసం చేశారంటూ విజయలక్ష్మీ అనే మహిళ కొద్దిరోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడేళ్లుగా తనను గండ్ర లైంగికంగా వాడుకున్నారని ఇప్పుడు ముఖం చాటేశాడని ఆరోపించారు. కేసు కూడా పెట్టింది ఆమె. అయితే ఆమె మరోసారి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగే ప్రయత్నం చేసింది.

అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేతను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే విజయలక్ష్మీ పదేపదే రచ్చ చేస్తోందంటూ ఆమెను చితక బాదారు. అనంతరం పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఆందోళనకు దిగిన విజయలక్ష్మీని తీసుకెళ్లారు. ఈమె గండ్ర పైనే కాకుండా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో నేత పైనా ఇదే తరహా లైంగిక ఆరోపణలు చేసిందని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News