హార్డ్ డిస్క్‌లో రేవంత్ రహస్యాలు.....
ఐటీ అధికారులమంటూ కొందరు తమ బంధువు రణధీర్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారని…. కానీ తామెలాంటి దాడులు చేయలేదని ఐటీ అధికారులు చెబుతున్నారంటూ ఓటుకునోటు నిందితుడు ఉదయ్ సింహ వెల్లడించిన నేపథ్యంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రణధీర్‌ను ఇంటి వద్ద వదలివెళ్లారు. రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమంటూ రణధీర్ ఇంటిపై దాడులు చేసి పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. అయితే తనను తీసుకెళ్లింది టాస్క్‌ఫోర్స్ పోలీసులని రణధీర్ రెడ్డి చెప్పారు. పోలీసులు […]
ఐటీ అధికారులమంటూ కొందరు తమ బంధువు రణధీర్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారని…. కానీ తామెలాంటి దాడులు చేయలేదని ఐటీ అధికారులు చెబుతున్నారంటూ ఓటుకునోటు నిందితుడు ఉదయ్ సింహ వెల్లడించిన నేపథ్యంలో అర్థరాత్రి 12 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రణధీర్‌ను ఇంటి వద్ద వదలివెళ్లారు.
రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమంటూ రణధీర్ ఇంటిపై దాడులు చేసి పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. అయితే తనను తీసుకెళ్లింది టాస్క్‌ఫోర్స్ పోలీసులని రణధీర్ రెడ్డి చెప్పారు.
పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పానన్నారు. ఈ సందర్భంగా ఒక హార్డ్ డిస్క్ గురించి రణధీర్ రెడ్డి బయటపెట్టారు. ఉదయ సింహ మూడు నెలల క్రితం ఇంటిని ఖాళీ చేస్తున్న సమయంలో ఒక కవర్ ఇచ్చాడని… అందులో ఒక హార్ట్ డిస్క్, అతడి తల్లి బ్యాంకు లాకర్ కీ ఉందని వివరించారు. అయితే హార్డ్ డిస్క్‌లో ఏముందో మాత్రం తనకు తెలియదన్నారు. పోలీసులు దాన్ని తీసుకున్నట్టు వివరించారు. పోలీసులు తనకు మరోసారి నోటీసులు ఇచ్చారని.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా అందులో ఆదేశించారన్నారు.
ఇప్పుడు రణధీర్ రెడ్డి చెప్పిన హార్డ్ డిస్క్‌పైనే చర్చ జరుగుతోంది. మూడు నెలల ముందే ఉదయ్ సింహ రహస్యంగా హార్డ్ డిస్క్ ఇచ్చారంటే అందులో కీలకమైన అంశాలే ఉంటాయని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశాలు అందులో ఉన్నట్టు భావిస్తున్నారు. హార్డ్ డిస్క్‌ను తెరిచి చూస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.