వైసీపీలో మార్పులే మార్పులు...!

వైసీపీలో అనేక మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇన్ చార్జిల విషయంలో జగన్ మార్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఇవి కొన్నిచోట్ల రచ్చలను రాజేస్తూ ఉన్నాయి. మరికొన్ని పరిశీలకులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే చిలకలూరిపేట విషయంలో అనూహ్య మార్పు జరిగింది. అంతలోనే విజయవాడ సెంట్రల్, ఈస్ట్ సీట్ల విషయంలో రచ్చ మొదలైంది. ఇక మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు కూడా జరిగింది. ఇవి ఎవ్వరూ ఊహించనివే. మొన్నటి వరకూ గుంటూరు ఎంపీ సీటుకు […]

Advertisement
Update: 2018-09-19 21:29 GMT

వైసీపీలో అనేక మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇన్ చార్జిల విషయంలో జగన్ మార్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఇవి కొన్నిచోట్ల రచ్చలను రాజేస్తూ ఉన్నాయి. మరికొన్ని పరిశీలకులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే చిలకలూరిపేట విషయంలో అనూహ్య మార్పు జరిగింది. అంతలోనే విజయవాడ సెంట్రల్, ఈస్ట్ సీట్ల విషయంలో రచ్చ మొదలైంది.

ఇక మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు కూడా జరిగింది. ఇవి ఎవ్వరూ ఊహించనివే. మొన్నటి వరకూ గుంటూరు ఎంపీ సీటుకు పోటీ చేస్తాడని అనుకున్న లావు కృష్ణదేవరాయలును అనూహ్యంగా నరసరావు పేటకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నాడు వైసీపీ అధినేత. ఇక గుంటూరు ఎంపీ సీటుకు కిలారు రోశయ్యను ఇన్ చార్జిగా ప్రకటించారు. ఇది అనూహ్యమైన మార్పే.

సామాజికవర్గ సమీకరణాలు, ఇతర బలాబలాలను బట్టి జగన్ ఈ నిర్ణయాలను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో ఇవన్నీ ఒకింత సంచలనాన్ని కూడా రేపుతున్నాయి. ఈ మార్పులతో పార్టీ వీడే నేతలు కూడా ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకు వంగవీటి రాధా వ్యవహారమే ఉదాహరణ. వంగవీటి మద్దతుదారులు రాజీనామాలు మొదలుపెట్టారు. వీళ్లు జనసేన బాట పడుతూ ఉండటం గమనార్హం.

మొత్తానికి వైసీపీలో ఇప్పుడిప్పుడే మార్పుల కాక రేపుతున్నాయి. ఇవి వైసీపీకి మేలు చేస్తాయా? అనే విషయం ఎన్నికల ఫలితాలతో కానీ స్పష్టత రాదు.

Tags:    
Advertisement

Similar News