గుంటూరులో గుర్రం ఓడింది.... గుండెపోటు వచ్చింది....

గుంటూరులోని గుర్రపు పందాల క్లబ్‌లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందాలు ఆడేందుకు వచ్చిన ఒక వ్యక్తి క్లబ్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. కొన్నేళ్లుగా పెనకాకాని రోడ్డులోని హెచ్‌ఆర్‌సీ క్లబ్‌లో గుర్రపు పందాల బెట్టింగ్ నడుస్తోంది. శ్రీధర్ అనే వ్యక్తి కూడా పందాలు ఆడేందుకు వచ్చాడు. తాను పందం కట్టిన గుర్రం ఓడిపోవడంతో శ్రీధర్‌కు గుండెపోటు వచ్చింది. పందంలో తన 60వేలు పోగానే ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి సొంతూరు తెనాలి మండలం చినరావూరు. ఈ […]

Advertisement
Update: 2018-09-17 07:45 GMT

గుంటూరులోని గుర్రపు పందాల క్లబ్‌లో విషాదం చోటు చేసుకుంది. గుర్రపు పందాలు ఆడేందుకు వచ్చిన ఒక వ్యక్తి క్లబ్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. కొన్నేళ్లుగా పెనకాకాని రోడ్డులోని హెచ్‌ఆర్‌సీ క్లబ్‌లో గుర్రపు పందాల బెట్టింగ్ నడుస్తోంది.

శ్రీధర్ అనే వ్యక్తి కూడా పందాలు ఆడేందుకు వచ్చాడు. తాను పందం కట్టిన గుర్రం ఓడిపోవడంతో శ్రీధర్‌కు గుండెపోటు వచ్చింది. పందంలో తన 60వేలు పోగానే ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు.

అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి సొంతూరు తెనాలి మండలం చినరావూరు. ఈ హార్స్ రేసింగ్ క్లబ్‌లో నిత్యం లక్షల్లో డబ్బు చేతులు మారుతుంటుందని చెబుతున్నారు. బడాబాబులు, రాజకీయనేతల కుమారులు ఇక్కడికి వస్తుంటారు. కొందరు సామాన్యులు కూడా ఈ రేస్‌లోకి వచ్చి శ్రీధర్‌ తరహాలో దెబ్బతింటున్నారు.

Advertisement

Similar News