పవన్ " కొరటాల కాంబినేషన్...

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్… మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా. కాంబినేషన్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మరి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే కచ్చితంగా హిట్ గ్యారెంటీ. కానీ ప్రస్తుతానికి కొరటాల, పవన్ కలవడం లేదు. ఫ్యాన్స్ మాత్రం తమదైన శైలిలో లెక్కలు వేసుకుంటున్నారు. తన సినిమాల్లో సోషల్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు పవన్. అటు కొరటాల శివ కూడా తన సినిమాల్లో సమజానికి పనికొచ్చే సందేశాన్ని […]

Advertisement
Update: 2016-09-26 21:11 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్… మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా. కాంబినేషన్ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మరి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే కచ్చితంగా హిట్ గ్యారెంటీ. కానీ ప్రస్తుతానికి కొరటాల, పవన్ కలవడం లేదు. ఫ్యాన్స్ మాత్రం తమదైన శైలిలో లెక్కలు వేసుకుంటున్నారు. తన సినిమాల్లో సోషల్ ఎలిమెంట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు పవన్. అటు కొరటాల శివ కూడా తన సినిమాల్లో సమజానికి పనికొచ్చే సందేశాన్ని ఇస్తుంటాడు. శ్రీమంతుడులో గ్రామాల దత్తత అంశాన్ని తీసుకున్నాడు. తాజాగా వచ్చిన జనతా గ్యారేజ్ లో హరితహారం కాన్సెప్ట్ పట్టుకున్నాడు. సో… ఇలాంటి డైరక్టర్ తో పవన్ సినిమా చేస్తే.. ఇంకా బాగుంటుందనేది పవనిజం ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలంటే కొన్నేళ్లు పడుతుంది. ఎందుకంటే.. తమతమ సినిమాలతో అటు కొరటాల, ఇటు పవన్ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Also Read

Tags:    
Advertisement

Similar News