మళ్లీ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు?

చంద్రబాబు విద్యార్హత అంశం తెరపైకి వచ్చింది. స్వయంగా చంద్రబాబే తన విద్యార్హతలను ప్రస్తావించి చర్చకు తెరలేపారు. శుక్రవారం విశాఖ జిల్లా పరవాడలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన చంద్రబాబు… తనకు ఇంగ్లీష్‌ రాదంటూ జగన్‌ ఎద్దేవా చేయడంపై మండిపడ్డారు. ”నాకు ఇంగ్లీష్‌ మాట్లాడడం రాదా… నేను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఎ, పీహెచ్‌డీ పూర్తి చేశా. ప్రపంచ దేశాలు మెచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఐటీని అభివృద్ధి చేసిందే నేను” అని చంద్రబాబు చెప్పారు. అయితే తాను పీహెచ్‌డీ చేశానని చంద్రబాబు […]

Advertisement
Update: 2016-09-23 23:46 GMT

చంద్రబాబు విద్యార్హత అంశం తెరపైకి వచ్చింది. స్వయంగా చంద్రబాబే తన విద్యార్హతలను ప్రస్తావించి చర్చకు తెరలేపారు. శుక్రవారం విశాఖ జిల్లా పరవాడలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన చంద్రబాబు… తనకు ఇంగ్లీష్‌ రాదంటూ జగన్‌ ఎద్దేవా చేయడంపై మండిపడ్డారు. ”నాకు ఇంగ్లీష్‌ మాట్లాడడం రాదా… నేను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఎ, పీహెచ్‌డీ పూర్తి చేశా. ప్రపంచ దేశాలు మెచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఐటీని అభివృద్ధి చేసిందే నేను” అని చంద్రబాబు చెప్పారు. అయితే తాను పీహెచ్‌డీ చేశానని చంద్రబాబు చెప్పడం ఆసక్తిగా ఉంది. చంద్రబాబు సమర్పించిన 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఎంఏ వరకు మాత్రమే చదివినట్టుగా ఉంది. ఎక్కడా కూడా తాను పీహెచ్‌డీ పూర్తి చేసినట్టు లేదు. పైగా ఎవరైనా పీహెచ్‌డీ పూర్తి చేస్తే పేరుకు ముందు డాక్టర్‌ అని రాసుకుంటారు. కానీ చంద్రబాబు ఎక్కడా అలా రాసుకున్న దాఖలాలు కూడా లేవు. ఒకవేళ చంద్రబాబు నిజంగా పీహెచ్‌డీ పూర్తి చేసి ఉంటే దాన్ని ఓ రేంజ్లో ఎలాగో పబ్లిసిటీ ఇప్పించుకునే వారు. చంద్రబాబు విద్యార్హతల గురించి తెలిసిన వారు కూడా ఆయన పీహెచ్‌డీ చేసినట్టు తమకు తెలియదని తెల్లమొహాలు వేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ, పీహెచ్‌డీ చేశానని చెప్పడం ఏంటో!. చంద్రబాబు తాను చదివిన చదువుల విషయాలు మరిచిపోయి ఇలా మాట్లాడారా లేకుంటే తాను ఉన్నత విద్యార్హత కలిగిన వ్యక్తినని చెప్పుకునేందుకు అలా చేశారా అన్నది తెలియాలి. బహుశా చంద్రబాబు పిహెచ్ డీ చేసిన విషయం రహస్యం కాబోలు. ఆయన నిజంగా పిహెచ్ డీ చేసి ఉంటే డాక్టరేట్ల కోసం ఇంత తాపత్రయ పడేవాడా?

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News