చంద్రబాబుపై డీసీ బ్యూరో చీఫ్ సెటైర్లు

పోలవరం కుడి కాలువైన పట్టిసీమ కాలువను ఇకపై నది అని పిలవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కాలువలోకి నీరు వదిలి దాన్నే నది అనడం మించిన విచిత్రం ఇంకొకటి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ కృష్ణారావు కూడా పట్టిసీమకు చంద్రబాబు నది హోదా ఇవ్వడాన్ని ఎద్దేవా చేశారు. నదికి కొన్ని లక్షణాలు ఉంటాయని అలాంటివేమీ లేని పట్టిసీమ కాలువను పట్టుకుని […]

Advertisement
Update: 2016-09-22 22:35 GMT

పోలవరం కుడి కాలువైన పట్టిసీమ కాలువను ఇకపై నది అని పిలవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కాలువలోకి నీరు వదిలి దాన్నే నది అనడం మించిన విచిత్రం ఇంకొకటి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఉదయం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ కృష్ణారావు కూడా పట్టిసీమకు చంద్రబాబు నది హోదా ఇవ్వడాన్ని ఎద్దేవా చేశారు. నదికి కొన్ని లక్షణాలు ఉంటాయని అలాంటివేమీ లేని పట్టిసీమ కాలువను పట్టుకుని నది అనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ”నేను గతంలో అనంతపురంలో జర్నలిస్ట్‌గా పనిచేశాను. అనంతపురం పట్టణం పక్కనే బుక్కరాయసముద్రం అనే ఊరు ఉంది. దానికి వాళ్లు సముద్రం అనిపెట్టుకున్నారు. అంతమాత్రాన అది సముద్రం అవుతుందా?. బ్రహ్మసాగరం అన్న పేరు కూడా పెట్టుకున్నారు. అంతమాత్రాన అది సాగరం అవుతుందా?”. అని ప్రశ్నించారు. కాలువను నది అనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరం ఎడమ కాలువ నుంచి విశాఖకు నీరు తీసుకెళ్లే కాలువకు కూడా పురోషోత్తమ నది అని నామకరణం చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపై జరిగిన అఫెక్స్ కమిటీ భేటీ వల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు సీఎంలు తమ తమ వాదన వినిపించి దానికే కట్టుబడి ఉన్నప్పుడు సమస్య ఎలా పరిష్కారం అవుతుందని కృష్ణారావు ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News