కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది... అది బినామీల సొమ్మే

సినీ పరిశ్రమలో ఈ మధ్య కలెక్షన్ల వ్యవహారం అనేది పెద్ద తతంగంలా తయారైంది. అగ్రహీరోల సినిమాలకైతే పోటీ పడి వందలకోట్లు వసూలు చేసినట్టు ప్రకటిస్తున్నారు. అయితే నిర్మాతలు చెప్పే వసూళ్ల లెక్క అంత గ్యాస్‌ అని ప్రముఖ నటుడు మోహన్‌బాబు తేల్చేశారు. సినిమాకు అన్ని కోట్లు వచ్చాయి… ఇన్ని కోట్లు వచ్చాయని చెప్పే లెక్కల్లో నిజం ఉండదన్నారు. చెబుతున్న అంకెలు, వాస్తవ లెక్కలు వేరన్నారు. అసలు ప్రస్తుతం చిత్రపరిశ్రమలో నిర్మాతల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు. పరిస్థితి […]

Advertisement
Update: 2016-09-17 04:45 GMT

సినీ పరిశ్రమలో ఈ మధ్య కలెక్షన్ల వ్యవహారం అనేది పెద్ద తతంగంలా తయారైంది. అగ్రహీరోల సినిమాలకైతే పోటీ పడి వందలకోట్లు వసూలు చేసినట్టు ప్రకటిస్తున్నారు. అయితే నిర్మాతలు చెప్పే వసూళ్ల లెక్క అంత గ్యాస్‌ అని ప్రముఖ నటుడు మోహన్‌బాబు తేల్చేశారు. సినిమాకు అన్ని కోట్లు వచ్చాయి… ఇన్ని కోట్లు వచ్చాయని చెప్పే లెక్కల్లో నిజం ఉండదన్నారు. చెబుతున్న అంకెలు, వాస్తవ లెక్కలు వేరన్నారు. అసలు ప్రస్తుతం చిత్రపరిశ్రమలో నిర్మాతల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్నారు. పరిస్థితి అలా తయారవడానికి కారణం కూడా నిర్మాతలేనన్నారు. ఒక దర్శకుడి సినిమా హిట్‌ కొడితే అతడి చుట్టూ చేరిపోతున్నారని చెప్పారు. రూ. 50లక్షల అర్హత ఉన్న డైరెక్టర్‌కు ఏకంగా రూ. 3కోట్లు ఇచ్చేస్తున్నారని వివరించారు. దాంతో పది కోట్ల సినిమాను ఏకంగా 60 కోట్ల బడ్జెట్‌తో సదరు దర్శకుడు తీస్తున్నారని అన్నారు. నిర్మాతలు పెడుతున్న సొమ్ము కూడా వారిది కాదని… వారి వెనుక కొందరు బినామీలు ఉన్నారని మోహన్‌బాబు చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం క్రమశిక్షణేనన్నారు. తొలినుంచి కూడా సెట్‌కు అందరి కంటే ముందుగానే వచ్చేవాడినన్నారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్‌బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News