తెలుగు ప్రొఫెసర్లకు విముక్తి....

సంవత్సరం క్రితం లిబియాలో ఐసిస్‌ ఉగ్రవాదుల చేతుల్లో  కిడ్నాప్‌కు గురైన తెలుగు ప్రొఫెసర్‌లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను విడుదల చేశారు. వీరిని 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియాకి వెళ్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. బాలరామ కిషన్‌, గోపీకృష్ణలతో పాటు కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను కూడా అప్పట్లో కిడ్నాప్‌కు గురయ్యారు. అయితే రెండు రోజుల తరువాత విజయ్‌ కుమార్‌, రామకృష్ణలను విడిచిపెట్టారు. కానీ బాలరామ కిషన్‌, గోపీకృష్ణలను విడిచిపెట్టకుండా వాళ్ల […]

Advertisement
Update: 2016-09-15 06:41 GMT

సంవత్సరం క్రితం లిబియాలో ఐసిస్‌ ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్‌కు గురైన తెలుగు ప్రొఫెసర్‌లు బలరామ కిషన్, తిరువీధుల గోపీకృష్ణలను విడుదల చేశారు. వీరిని 2015 జూలై 29న లిబియా నుంచి ట్యునీషియాకి వెళ్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. బాలరామ కిషన్‌, గోపీకృష్ణలతో పాటు కర్నాటకకు చెందిన విజయ్ కుమార్, రామకృష్ణలను కూడా అప్పట్లో కిడ్నాప్‌కు గురయ్యారు. అయితే రెండు రోజుల తరువాత విజయ్‌ కుమార్‌, రామకృష్ణలను విడిచిపెట్టారు. కానీ బాలరామ కిషన్‌, గోపీకృష్ణలను విడిచిపెట్టకుండా వాళ్ల బందీలుగా ఉంచుకున్నారు. వీరిలో బలరామ కిషన్‌ స్వస్థలం కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామం కాగా మరొక ప్రొఫెసర్‌ రామకృష్ణ శ్రీకాకుళం టెక్కలికి చెందినవారు. కిడ్నాపర్లు ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు సురక్షితంగా విడుదల కావడం పట్ల విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ తన ట్విటర్‌ ద్వారా తన హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ఫ్రొఫెసర్‌లు విడుదలకావడానికి సహకరించినందుకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సుష్మాస్వరాజ్ కు తన ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News