కొణిజేటి ముందు కుప్పిగంతులా?.. నో యూజ్

కొణిజేటి రోశయ్య. ఏపీలో మోస్ట్‌ సీనియర్ నేత. కొద్ది రోజుల క్రితమే గవర్నర్‌గా పదవీ విరమణ చేసి హైదరాబాద్ వచ్చేశారు. దీంతో ఆయన నుంచి చాలా విషయాలు రాబట్టాలని చాలా మీడియా సంస్థలు ఆశపడ్డాయి. సుధీర్ఘ అనుభవంఉంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని భవిష్యత్తు గురించి చెబుతారని చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లారు. ఇంట్లోకి ఆహ్వానించి ఇంటర్వ్యూలు అయితే ఓప్పిగ్గా ఇచ్చారు రోశయ్య. కానీ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఆయన నుంచి […]

Advertisement
Update: 2016-09-15 01:13 GMT

కొణిజేటి రోశయ్య. ఏపీలో మోస్ట్‌ సీనియర్ నేత. కొద్ది రోజుల క్రితమే గవర్నర్‌గా పదవీ విరమణ చేసి హైదరాబాద్ వచ్చేశారు. దీంతో ఆయన నుంచి చాలా విషయాలు రాబట్టాలని చాలా మీడియా సంస్థలు ఆశపడ్డాయి. సుధీర్ఘ అనుభవంఉంది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని భవిష్యత్తు గురించి చెబుతారని చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లారు. ఇంట్లోకి ఆహ్వానించి ఇంటర్వ్యూలు అయితే ఓప్పిగ్గా ఇచ్చారు రోశయ్య. కానీ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఆయన నుంచి తమకు కావాల్సింది మాత్రం రాబట్టలేకపోయారు. జగన్‌ గురించి, చంద్రబాబు గురించి, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఇలా చాలా ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూలో కాసింత మసాలా అద్దేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నములన్నీ వ్యర్థమాయను. బై బర్త్ మాటకారి అయిన రోశయ్య… తన మాటకారి తనంతో పాటు ఈసారి అనుభవాన్ని జోడించి సమాధానాలు చెప్పారు. వచ్చేఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అని ప్రశ్నించగా నవ్వేసి కాలమే సమాధానం చెబుతుందని సమాధానమిచ్చారు. చాలా ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు కదా… ఎవరంటే బాగా ఇష్టమని ప్రశ్నించగా అందరూ తనకు ఇష్టమైన వారే అని చెప్పారు. కాకపోతే వైఎస్‌తో సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి హఠాత్తుగా వచ్చిందని… అది కూడా వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయిన సమయంలో సీఎం కావాల్సి వచ్చిందని కాబట్టి ఆ పదవితో తానేమీ సంతోషించలేదన్నారు.

రెండు రాష్ట్రాల్లో పాలనపై అభిప్రాయం అడగ్గా… ఇద్దరూ కష్టపడుతున్నారు, కొన్నేళ్లకు అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రులు సరిగా పాలిస్తే మరోసారి అవకాశం ఉంటుంది లేకుంటే మరొకరికి ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంపైనా చూద్దాం ఏంజరుగుతోందో అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో జగన్ అసమ్మతి, తెలంగాణ ఉద్యమం రెండింటిలో ఏదీ ఇబ్బందికలిగించిందని ప్రశ్నించగా రెండూ ఒకటే అన్నారు. అంతకు మించి దానిపై మాట్లాడలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలపై అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతాయన్నారు. తెలంగాణ ఏర్పాటుపై స్పందిస్తూ… ఒక పాత కమిట్‌మెంట్ ఉందని ఇచ్చారు. కానీ అది ప్రయోజనం కాదని కాంగ్రెస్‌కు తర్వాత తెలిసింది. అయితే తెలంగాణ ఏర్పాటును తప్పుడు నిర్ణయం అని మాత్రం అనలేమన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానిగా పనికొస్తారా అన్న దానిపైనా రోశయ్య తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే ఎంపీలంతా కలిసి ఎన్నుకుంటే అటోమెటిక్‌గా ఆయనే పెద్దనాయకుడు అయిపోతారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌ పుంజుకుంటుందో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. మొత్తం మీద నాలుగైదు ఇంటర్వ్యూలు ఇచ్చిన రోశయ్య ఎక్కడా కూడా మరొకరిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడలేదు. 84 ఏళ్ల వయసులో ఒక పెద్దమనిషిగానే స్పందించారు.తాను ఏ పదవి తీసుకోనని వయసు రీత్యా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎవరైనా వస్తే సలహాలు ఇస్తానన్నారు. సంచలన విషయాలు ఆయన నోటి నుంచి చెప్పించేందుకు కొందరు ప్రయత్నించినా ఆయన ముందు ఎత్తులు పారలేదు. రోశయ్య చేత పాట పాడించేందుకు కూడా ఒక జర్నలిస్ట్ ప్రయత్నించారు. కానీ అదీ వీలుకాలేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News