ఇంట‌లిజెన్స్ అధికారుల‌ను ర‌హ‌స్యంగా క‌లిసిన‌ మ‌హేశ్‌?

నిఘా అధికారుల‌ను ర‌హ‌స్యంగా క‌ల‌వాల్సిన అవ‌స‌రం ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు ఏముంది? ఆయ‌నకు ఉంటే గింటే.. ఐటీ అధికారుల‌తో పనిఉంటుంది  కానీ, ఇంటలిజెన్స్ అధికారుల‌తో ఏంప‌ని? అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. మ‌హేశ్ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తో  చేస్తోన్న తాజా చిత్రంలో మ‌హేశ్ ఇంటలిజెన్స్ అధికారి పాత్ర వేస్తున్నారంట‌. అందులో భాగంగానే పాత్ర ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ కోసం ప్రిన్స్ బాగా హోంవ‌ర్క్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. నిఘా అధికారులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు?  విధి నిర్వ‌హ‌ణలో ఎలా ఉంటారు? అన్న […]

Advertisement
Update: 2016-09-14 02:19 GMT
నిఘా అధికారుల‌ను ర‌హ‌స్యంగా క‌ల‌వాల్సిన అవ‌స‌రం ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు ఏముంది? ఆయ‌నకు ఉంటే గింటే.. ఐటీ అధికారుల‌తో పనిఉంటుంది కానీ, ఇంటలిజెన్స్ అధికారుల‌తో ఏంప‌ని? అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. మ‌హేశ్ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తో చేస్తోన్న తాజా చిత్రంలో మ‌హేశ్ ఇంటలిజెన్స్ అధికారి పాత్ర వేస్తున్నారంట‌. అందులో భాగంగానే పాత్ర ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ కోసం ప్రిన్స్ బాగా హోంవ‌ర్క్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. నిఘా అధికారులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? విధి నిర్వ‌హ‌ణలో ఎలా ఉంటారు? అన్న వివ‌రాలు తెలుసుకుంటే పాత్ర చిత్రీక‌ర‌ణ‌కు బాగా ప్ల‌స్ అవుతుంద‌ని మ‌హేశ్ భావించాడు. అందుకే త‌న‌కు తెలిసిన సీనియ‌ర్ ఇంట‌లిజెన్స్ అధికారుల‌ను కొంత‌కాలంగా క‌లుస్తూ ప‌లు విష‌యాలు తెలుసుకుంటున్నాడ‌ని స‌మాచారం. అదీ అస‌లుక‌థ‌!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News