గవర్నర్ వద్ద బాబు మరీ అంత దీనంగా మాట్లాడారా?

మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఓటుకు నోటు, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గవర్నర్‌తో భేటీ సమయంలో చంద్రబాబు ఒకింత కినుక వహించి వాపోయారని ఒక ప్రముఖ పత్రిక వెల్లడించింది. తాను తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకుండా, ఏపీలో తన పని తాను చేసుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వీడడం లేదని చంద్రబాబు వాపోయారని పత్రిక కథనం. తాను తెలంగాణ రాజకీయాల్లో […]

Advertisement
Update: 2016-09-13 23:05 GMT

మంగళవారం గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఓటుకు నోటు, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గవర్నర్‌తో భేటీ సమయంలో చంద్రబాబు ఒకింత కినుక వహించి వాపోయారని ఒక ప్రముఖ పత్రిక వెల్లడించింది. తాను తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టకుండా, ఏపీలో తన పని తాను చేసుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి వీడడం లేదని చంద్రబాబు వాపోయారని పత్రిక కథనం. తాను తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టనని, విజయవాడ నుంచే పాలన సాగిస్తానని, టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో మాత్రమే హైదరాబాద్ వస్తుంటానని చెప్పినప్పటికీ కేసీఆర్‌ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును పదేపదే తెరపైకి తెచ్చి ఇబ్బంది పెడుతోందని చంద్రబాబు ఆవేదన చెందారట.

ఏసీబీ కోర్టులో ఒక ఎమ్మెల్యే( వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే) కేసు వేసి తిరిగి విచారణకు ఆదేశించే పరిస్థితి వచ్చేదాకా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కళ్లు మూసుకుందని బాబు ప్రశ్నించారని పత్రిక చెబుతోంది. తెలంగాణ ఇంటెలిజెన్స్‌కు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారట బాబు. అయితే చంద్రబాబు వాదనతో గవర్నర్ ఏకీభవించలేదని టీడీపీ నేతలే చెప్పినట్టు కథనంలో పత్రిక వెల్లడించింది. ఓటుకు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్ వేసిన విషయాన్ని కనుక్కోవడంలో విఫలమయ్యారంటూ ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులపై మీరు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని తాను పత్రికల్లో చదివానని గవర్నర్‌ చెప్పారని పేర్కోంది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై తాను కూడా కేసీఆర్, టీ ఏసీబీ డైరెక్టర్‌తో మాట్లాడానని కానీ వారి ప్రమేయం అందులో లేదని… లేనిపోని అపోహలు పెట్టుకుని ఆందోళన చెందవద్దని గవర్నర్ నరసింహన్ చంద్రబాబుకు సూచించారని పత్రిక చెబుతోంది. చంద్రబాబు గవర్నర్ వద్ద మరీ ఇంత దీనంగా మాట్లాడి ఉంటే ఆయన చాలా ఆందోళనలో ఉన్నట్టే భావించాలి. పైగా గవర్నర్ ప్రధానమంత్రిని కలిసి తన నివేదిక అందజేయనున్న ముందురోజు గవర్నర్ ని కలిసి, ఆయన వద్ద దీనంగా వ్యవహరించడం, మరునాడు గవర్నర్ ఇంకా కొద్ది గంటల్లో ప్రధానిని కలవనున్నాడనగా టీడీపీ నాయకులు కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ ని సందర్శించడం చూస్తుంటే టీడీపీ ఎందుకో భయపడుతోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యనిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News