పవన్ వైఖరి ఏంటో తేల్చి చెప్పిన ఆ రెండు పాయింట్లు...

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిన నేపథ్యంలో కాకినాడ సభ వేదికగా పవన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటారని వార్తలొచ్చాయి. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి పవన్‌ ఆమరణ దీక్షకు దిగే అవకాశం ఉందని లేని పక్షంలో ఢిల్లీకి పాదయాత్ర చేస్తారని కథనాన్ని ప్రచురించింది. కానీ భవిష్యత్తు పోరాటంపై పవన్‌ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో స్పందించలేదు. తాను భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రాలేదని చెప్పారు. రాస్తారోకోలు, బంద్‌లను చేయాల్సిందిగా పిలుపునిచ్చేందుకు రాలేదని చెప్పారు. పోరాడాల్సింది మనం కాదు. ఎంపీలున్నారు. […]

Advertisement
Update: 2016-09-09 06:35 GMT

ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిన నేపథ్యంలో కాకినాడ సభ వేదికగా పవన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటారని వార్తలొచ్చాయి. టీడీపీ అనుకూల పత్రిక ఒకటి పవన్‌ ఆమరణ దీక్షకు దిగే అవకాశం ఉందని లేని పక్షంలో ఢిల్లీకి పాదయాత్ర చేస్తారని కథనాన్ని ప్రచురించింది. కానీ భవిష్యత్తు పోరాటంపై పవన్‌ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో స్పందించలేదు. తాను భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రాలేదని చెప్పారు. రాస్తారోకోలు, బంద్‌లను చేయాల్సిందిగా పిలుపునిచ్చేందుకు రాలేదని చెప్పారు. పోరాడాల్సింది మనం కాదు. ఎంపీలున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉంది, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు… వారు పోరాడాలి అని అన్నారు. వారంతా ఫెయిల్ అయితే అప్పుడు ఎవరికీ నష్టం లేకుండా ఉద్యమం చేద్దామని చెప్పారు.

రేపు వైసీపీ, సీపీఎం బంద్‌కు పిలుపునిచ్చాయని… ఆ బంద్‌ను తాను వ్యతిరేకించడం లేదు గానీ… పాల్గొంటారా లేదా అన్నది మీ ఇష్టం అని అభిమానులకు సూచించారు. అభిమానులను ఉద్దేశించి మీరెందుకు కష్టపడాలి, పదవుల్లో కూర్చున్నది ఎవరు?. పార్లమెంట్‌లో సబ్సిడీ ఫుడ్ తింటున్న వారు పోరాటం చేయాలన్నారు. అంతే కాదు ఆమరణ దీక్ష చేస్తారన్న వార్తలపైనా పవన్ స్పందించారు. కాకినాడ సభలో పవన్ ఏంచేస్తారు అని అడుగుతున్నారు. ఏం చేయాలి?. ఆమరణ దీక్ష చేయాలా?. బలిదానం కోరుకుంటున్నారా?.నా నుంచి పొలిటికల్ డ్రామాను కోరుకుంటున్నారా?. మీరు పోరాడి చేతులు ఎత్తేసిన తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. నేను దిగానంటే తాడోపేడో తేల్చుకుంటా అని పవన్ వ్యాఖ్యానించారు.

మొత్తం మీద ఇప్పటికప్పుడు ప్రత్యేక హోదా కోసం పవన్‌ నుంచి ఎలాంటి పోరాటం ఉండదని తేలిపోయింది. మిగిలిన పార్టీలన్నీ చేతులెత్తేస్తే అప్పుడు తన తడాఖా చూపిస్తానంటున్నారు. కానీ ఇంకో పదేళ్లు అయినా సరే పోరాటం చేస్తున్నామంటూ పార్టీలు చెప్పుకుని తిరుగుతుంటాయే గానీ తమ వల్ల కాదు అని చేతులు ఎత్తివేయడం ఉండదు. అలాంటప్పుడు పార్టీలు చేతులు ఎత్తివేసేది ఎప్పుడో … పవన్‌ రంగంలోకి దిగేది ఎప్పుడో అన్నది ఆలోచించాలి. అయినా హోదా ఇవ్వడం కుదరదని చెప్పేసిన తర్వాత కూడా పోరాటం మొదలుపెట్టకపోవడం వెనుక ఏ వ్యూహం ఉందో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News