వెంకయ్య పంచెలో ఏమీ లేదని నాకూ అర్థరాత్రే తెలిసింది

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఐ నేత నారాయణ సెటైర్లు వేశారు. తాను కూడా వెంకయ్యనాయుడు గురించి చాలా ఊహించుకున్నానని అన్నారు. కానీ ఆరవ తేది ఆర్థరాత్రే తనకు అసలు నిజం తెలిసిందన్నారు. వెంకయ్యలోగానీ, వెంకయ్య పంచెలో గానీ ఏమీ లేదన్న విషయం అర్థరాత్రే అర్థమైందన్నారు. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్యనాయుడు ఇవాళ మాత్రం ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదాపై జిల్లాలన్నీ తిరిగి సన్మానాలు చేయించుకున్న వెంకయ్య ఇప్పుడు మాట మార్చేశారన్నారు. అసలు వెంకయ్యనాయుడిది నాలుకా లేక […]

Advertisement
Update: 2016-09-08 23:30 GMT

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై సీపీఐ నేత నారాయణ సెటైర్లు వేశారు. తాను కూడా వెంకయ్యనాయుడు గురించి చాలా ఊహించుకున్నానని అన్నారు. కానీ ఆరవ తేది ఆర్థరాత్రే తనకు అసలు నిజం తెలిసిందన్నారు. వెంకయ్యలోగానీ, వెంకయ్య పంచెలో గానీ ఏమీ లేదన్న విషయం అర్థరాత్రే అర్థమైందన్నారు. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్యనాయుడు ఇవాళ మాత్రం ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదాపై జిల్లాలన్నీ తిరిగి సన్మానాలు చేయించుకున్న వెంకయ్య ఇప్పుడు మాట మార్చేశారన్నారు. అసలు వెంకయ్యనాయుడిది నాలుకా లేక తాటిమట్టా అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం వెంకయ్య పంచెను ఊడగొట్టాలని నారాయణ వ్యాఖ్యానించారు. అందుకు గురువారం రియాక్ట్ అయిన వెంకయ్యనాయుడు.. నా పంచె ఊడగొట్టి చూడాల్సినంత ఆసక్తి ఏంటో?… ఏం వారికి లేవా అని అన్నారు. ఇందుకు కౌంటర్‌గానే నారాయణ మరోసారి వెంకయ్యపై పంచె కామెంట్స్ చేశారు. మరోవైపు… ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో వెంకయ్యనాయుడిని కలిశారు. ఏపీకి ప్రత్యేకప్యాకేజ్‌ విషయంలో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏపీ కోలుకోవడం సాధ్యం కాదని వెంకయ్యనాయుడు చెప్పారు. టీడీపీ, బీజేపీ కలిసి పనిచేయడం చారిత్రక అవసరమన్నారు. రైల్వే జోన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ గురించి బీజేపీ నేతలు ప్రజలకు వివరించాలని వెంకయ్యనాయుడు సూచించారు.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News