సీఎం ప్రకటన తర్వాత చర్చ జరపవచ్చా?

ప్రత్యేక హోదా కోసం వైసీసీ సభ్యులు అసెంబ్లీని స్తంభింపచేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనిత తప్పుపట్టారు. ప్రతిపక్షనాయకుడికి మినిమమ్ కామన్‌ సెన్స్‌ లేకుండాపోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ అసెంబ్లీ విద్రోహకశక్తులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ తీరుందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా బంద్‌లు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. వచ్చేఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా మిగలదన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం ప్రకటన చేసే వరకు ఎందుకు ఓర్పుగా ఉండడం లేదని ప్రశ్నించారు. ప్రకటన […]

Advertisement
Update: 2016-09-08 23:05 GMT

ప్రత్యేక హోదా కోసం వైసీసీ సభ్యులు అసెంబ్లీని స్తంభింపచేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే అనిత తప్పుపట్టారు. ప్రతిపక్షనాయకుడికి మినిమమ్ కామన్‌ సెన్స్‌ లేకుండాపోయిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ అసెంబ్లీ విద్రోహకశక్తులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ తీరుందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా బంద్‌లు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. వచ్చేఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా మిగలదన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం ప్రకటన చేసే వరకు ఎందుకు ఓర్పుగా ఉండడం లేదని ప్రశ్నించారు. ప్రకటన తర్వాత హోదాపై వైసీపీ మాట్లాడే అవకాశం వస్తుందన్నారు.

అయితే టీడీపీ వాదనను వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తప్పుపట్టారు. ప్రకటన చేసిన తర్వాత దానిపై క్లారిఫికేషన్స్ మాత్రమే అడిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రకటన తర్వాత పూర్తి స్థాయిలో చర్చకు రూల్స్ ప్రకారం వీలుండదన్నారు. అందుకే ముందు చర్చ జరగాల్సిందిగా తాము పట్టుపడుతున్నామన్నారు. మొత్తం మీద హోదాపై ప్రకటన చేసి దానిపై క్లారిఫికేషన్స్ కు మాత్రమే అవకాశం ఇచ్చి పూర్తి స్థాయి చర్చ జరగకుండా అడ్డుకోవడం టీడీపీ వ్యూహమని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News