వైసీపీ దెబ్బకు సీటు మార్చుకున్న విష్ణుకుమార్‌రాజు

ప్రత్యేక హోదా అంశం అసెంబ్లీని కుదిపేసింది. పది నిమిషాల వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు హోదా కోసం నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ”హోదా ఆంధ్రుల హక్కు. ఓటుకు నోటుకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు రాజీనామా చేయాలి. వి వాన్ట్ జస్టిస్. ఏపీని ముంచిన చంద్రబాబు” అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యనే అధికారపక్ష సభ్యులు మాట్లాడారు.  బీజేపీ శాసనసభ పక్ష […]

Advertisement
Update: 2016-09-08 00:09 GMT

ప్రత్యేక హోదా అంశం అసెంబ్లీని కుదిపేసింది. పది నిమిషాల వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ సభ్యులు హోదా కోసం నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి ”హోదా ఆంధ్రుల హక్కు. ఓటుకు నోటుకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు రాజీనామా చేయాలి. వి వాన్ట్ జస్టిస్. ఏపీని ముంచిన చంద్రబాబు” అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే వైసీపీ సభ్యుల ఆందోళన మధ్యనే అధికారపక్ష సభ్యులు మాట్లాడారు.

బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ… వైసీపీ దెబ్బకు తాను సీటునే మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. వైసీపీ సభ్యుల వల్ల తనకు తన సీట్లో నిల్చుకుని మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందని అందుకే మరోస్థానంలో కూర్చుంటున్నానని చెప్పారు. పోడియం ముందు ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని రాజు పదేపదే డిమాండ్ చేశారు. వైసీపీసభ్యులను సస్పెండ్ చేయకపోతే తాము కూడా పోడియం చుట్టుముట్టాల్సి వస్తుందన్నారు. ఇంత ఓపికగా పనిచేసే స్పీకర్‌ను ఎక్కడా చూడలేదని విష్ణుకుమార్‌రాజు అన్నారు. అందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇంత నీచమైన పత్రిపక్షాన్ని తాను ఎక్కడా చూడలేదని విమర్శించారు. సభ అదుపులోకి రాకపోవడంతో రెండోసారి సభ వాయిదా పడింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News