పురందేశ్వరి గబ్బుపట్టిపోయారు, జగన్‌కు మంచి జీతమిస్తాం...

ప్రత్యేకహోదా అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ, బీజేపీ చేసిన ద్రోహంపై వామపక్ష నాయకులు పైర్ అయ్యారు. రెండున్నరేళ్లు ప్రజలను నమ్మించి మోసం చేశారని నారాయణ మండిపడ్డారు. కేంద్రం నుంచి టీడీపీ వెంటనే బయటకురావాలన్నారు. హోదాకు వ్యతిరేకంగా పురందేశ్వరి మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీలో చేరిన తర్వాత పురందేశ్వరి గబ్బుపట్టిపోయారని ఘాటు వ్యాఖ్య చేశారు నారాయణ. శనివారం జరిగే బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. రెండేళ్ల పాటు హోదా పేరుతో మోసం చేసిన బీజేపీనేతలు ఇప్పుడు కొత్త నాటకం […]

Advertisement
Update: 2016-09-08 04:14 GMT

ప్రత్యేకహోదా అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ, బీజేపీ చేసిన ద్రోహంపై వామపక్ష నాయకులు పైర్ అయ్యారు. రెండున్నరేళ్లు ప్రజలను నమ్మించి మోసం చేశారని నారాయణ మండిపడ్డారు. కేంద్రం నుంచి టీడీపీ వెంటనే బయటకురావాలన్నారు. హోదాకు వ్యతిరేకంగా పురందేశ్వరి మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీలో చేరిన తర్వాత పురందేశ్వరి గబ్బుపట్టిపోయారని ఘాటు వ్యాఖ్య చేశారు నారాయణ. శనివారం జరిగే బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

రెండేళ్ల పాటు హోదా పేరుతో మోసం చేసిన బీజేపీనేతలు ఇప్పుడు కొత్త నాటకం మొదలుపెట్టారని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వెంకయ్యనాయుడికి సిగ్గుశరం ఉంటే కేంద్ర మంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా చేసేవారన్నారు. ఇంకా పదవిని పట్టుకుని వేలాడుతున్నారంటే ఆయనకు సిగ్గుశరం లేదనే భావించాలన్నారు. చరిత్రలో వెంకయ్యనాయుడు ఒక మోసగాడిలా నిలిచిపోతారన్నారు. వెంకయ్యకు సిగ్గుంటే రాజీనామా చేయాలని లేకుంటే తాను చేతగానివాణ్ణని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు నంగనాచిలా మాట్లాడడం మానుకోవాలన్నారు. తాను బెదిరించాను కాబట్టే కేంద్రంలో కదలిక వచ్చిందని అనుకూల పత్రికలో కొద్దిరోజుల క్రితం కథనం రాయించుకున్న చంద్రబాబు… ఇప్పుడెందుకు కేంద్రం నుంచి బయటకు రావడం లేదో చెప్పాలన్నారు. పారామిలటరీ బలగాలను దింపినా సరే శనివారం జరిగే బంద్‌ను అడ్డుకోలేరన్నారు రామకృష్ణ.

మరోవైపు… కాకినాడలో జరిగే పవన్‌ కల్యాణ్ సభకు వ్యక్తిగతంగా తాను మద్దతిస్తానని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. హోదా కన్నా ప్యాకేజే మంచిదన్న విషయంలో త్వరలోనే ప్రజలకు అర్థమవుతుందన్నారు. జగన్‌ మంచి సలహాలు ఇస్తే ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుని మంచి జీతం కూడా ఇస్తామని మాణిక్యాలరావు అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News