విజయవాడకు వారం పాటు భారీగా రైళ్లు రద్దు

విజయవాడ రైల్వేస్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను ఆధునీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం వారం రోజుల పాటు విజయవాడ రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు వారం రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఈనెల 20 నుంచి 28వరకు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లను రద్దు చేస్తున్నారు. మరో 215 రైళ్లను దారి మళ్లించనున్నారు. 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నారు. ఈ మార్పులు 20 […]

Advertisement
Update: 2016-09-07 11:30 GMT

విజయవాడ రైల్వేస్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌ను ఆధునీకరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం వారం రోజుల పాటు విజయవాడ రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు వారం రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఈనెల 20 నుంచి 28వరకు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లను రద్దు చేస్తున్నారు. మరో 215 రైళ్లను దారి మళ్లించనున్నారు. 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేయనున్నారు. ఈ మార్పులు 20 నుంచి 28 వరకు విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లకూ వర్తిస్తాయి. అత్యంత బిజీగా ఉండే సికింద్రాబాద్ – కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం నిలిచిపోనున్నాయి.

హైదరాబాద్-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవు. ఏలూరు, విజయవాడ బైపాస్ రాయనపాడు, కొండపల్లి స్టేషన్‌ల మీదుగా వీటిని నడుపుతారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్… భువనగిరి, రాయగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ల మీదుగా తిరుపతికి వెళ్తుంది. ముంబై సీఎస్‌టీ-భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలోనే నిలిచిపోనున్నాయి. ఇలా అనేక రైళ్ల సర్వీసుల్లో మార్పులు జరగనున్నాయి. వీటిని గమనించి ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC