ఢిల్లీకి రానని భీష్మించడం వెనుక అసలు కారణం ఇదే

ఉదయం నుంచి ప్రత్యేక ప్యాకేజ్‌పై అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ప్రతి కదలికను విజయవాడలోని చంద్రబాబుకు సుజనాచౌదరి, సీఎం రమేష్ వివరిస్తూనే ఉన్నారు. ప్యాకేజ్ స్వరూపంపై వారు వివరించారు. చంద్రబాబు అంతా ఓకే అన్న తర్వాతే ప్యాకేజ్‌పై కేంద్రం ప్రకటనకు సిద్ధమైంది. అయితే ప్రకటన సమయంలో చంద్రబాబు కూడా పక్కనే ఉండాలని అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్ భావించారు. ఇందుకోసం వెంకయ్యనాయుడుతో చంద్రబాబుకు ఫోన్‌ చేయించి ఢిల్లీ రావాల్సిందిగా […]

Advertisement
Update: 2016-09-07 11:12 GMT

ఉదయం నుంచి ప్రత్యేక ప్యాకేజ్‌పై అటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ప్రతి కదలికను విజయవాడలోని చంద్రబాబుకు సుజనాచౌదరి, సీఎం రమేష్ వివరిస్తూనే ఉన్నారు. ప్యాకేజ్ స్వరూపంపై వారు వివరించారు. చంద్రబాబు అంతా ఓకే అన్న తర్వాతే ప్యాకేజ్‌పై కేంద్రం ప్రకటనకు సిద్ధమైంది. అయితే ప్రకటన సమయంలో చంద్రబాబు కూడా పక్కనే ఉండాలని అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌ సింగ్ భావించారు. ఇందుకోసం వెంకయ్యనాయుడుతో చంద్రబాబుకు ఫోన్‌ చేయించి ఢిల్లీ రావాల్సిందిగా కోరారు. కానీ ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం చంద్రబాబు అస్సలు అంగీకరించలేదు. ప్యాకేజ్‌ ప్రకటనలో పాల్గొనేందుకు చంద్రబాబు ఎందుకు జంకుతున్నారని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.

హోదా స్థానంలో ప్యాకేజ్ ఇస్తుండడంపై ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకటన చేసే సమయంలో పక్కనే ఉంటే చంద్రబాబుపైనా జనం ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ ప్రకటన సమయంలో పక్కనే లేకపోవడం వల్ల చంద్రబాబుకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఒకవేళ ప్యాకేజ్‌పై ప్రజల నుంచి ఊహించని వ్యతిరేకత వస్తే వెంటనే చంద్రబాబు కూడా ప్లేట్ ఫిరాయించేందుకు అవకాశం ఉంటుంది. ప్యాకేజ్ తమకు నచ్చలేదని కాబట్టి హోదానే ఇవ్వాలని తాను డిమాండ్ చేసేందుకు చాన్స్ ఉంటుంది. తాను కూడా హోదాకోసమే పట్టుబట్టానని అందుకే ప్యాకేజ్ పై ప్రకటన సమయంలో ఢిల్లీకి కూడా వెళ్లలేదని జనాన్ని నమ్మించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రకటన చేసే సమయంలో కేంద్రమంత్రుల పక్కన కూర్చుంటే చంద్రబాబుకు ఆ అవకాశం ఉండదు. ప్యాకేజ్‌పై జనం నుంచి వ్యతిరేకత వస్తే దాన్ని కేంద్రంతో పాటు చంద్రబాబు కూడా భరించాల్సి ఉంటుంది. ప్యాకేజ్‌పై ప్రజల నుంచి సానుకూలత వస్తే తానే పట్టుబట్టి భారీ ప్యాకేజ్ ప్రకటించేలా చేశానని ఎలాగో అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవచ్చు. అంటే ఏది జరిగినా మంచి మాత్రమే బాబు ఖాతాలో పడాలి. చెడు మాత్రం కేంద్రమే భరించాలన్న మాట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News