చంద్రబాబు చేతిలో కిరణ్ బంతి

అప్పుడు కాంగ్రెస్‌ నేతలు, ఇప్పుడు చంద్రబాబు. వ్యక్తులు, పార్టీలు మారాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం మారలేదు. తెలంగాణ విడిపోవడం ఖాయమని విభజనకు ఏడాది ముందే కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డికి తెలుసు. కానీ తమ పదవి పుణ్య కాలం పూర్తి చేసుకునేందుకు రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం, ఆఖరి బంతి ఉంది. బ్యాట్ మా చేతిలో ఉంది అంటూ నాటకాలు ఆడారు. బంతి, బ్యాట్ మాటలు చెబుతూ.. ఒక […]

Advertisement
Update: 2016-09-07 06:00 GMT

అప్పుడు కాంగ్రెస్‌ నేతలు, ఇప్పుడు చంద్రబాబు. వ్యక్తులు, పార్టీలు మారాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసేందుకు ఎంచుకున్న మార్గం మాత్రం మారలేదు. తెలంగాణ విడిపోవడం ఖాయమని విభజనకు ఏడాది ముందే కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డికి తెలుసు. కానీ తమ పదవి పుణ్య కాలం పూర్తి చేసుకునేందుకు రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం, ఆఖరి బంతి ఉంది. బ్యాట్ మా చేతిలో ఉంది అంటూ నాటకాలు ఆడారు. బంతి, బ్యాట్ మాటలు చెబుతూ.. ఒక వేళ విభజన జరిగితే ఏపీకి ఏం కావాలన్న దానిపై ఒక్కశాతం కూడా ఆలోచన చేయకుండా ఏపీని నట్టేట ముంచేశారు. అప్పట్లో కాంగ్రెస్ నేతలు చేసిన పనిని చంద్రబాబు ఓ రేంజ్‌లో కళ్లు పెద్దవి చేసి తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పోయింది. నిప్పునని చెప్పుకునే చంద్రబాబును జనం నెత్తిన పెట్టుకుని ఓటేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఏమిటి?. అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని కాసేపు ప్యాకేజ్‌ అని, మరికాసేపు హోదాకే పట్టుపడుతున్నామంటూ లీకులిచ్చుకుని జనానికి చెవిలో పూలు పెడుతున్నారు. రెండుమూడు రోజులుగా చంద్రబాబు అనుకూల లీకు పత్రిక కథనాలను జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు అసలు రూపం అర్థమవుతుంది.

మంగళవారం జరిగిన కేబినెట్‌ భేటీలో సహచర మంత్రులతో కేంద్రం ప్యాకేజ్ ఇవ్వబోతోందని చంద్రబాబు చెప్పారు. ఇచ్చినకాడికి తీసుకుందామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారంటూ బాబుగారి లీకు పత్రికే మొదటి పేజీలో అచ్చేసింది. పైగా ప్రకటనను మరోసారి వాయిదా వేసేందుకు కేంద్రం ప్రయత్నించగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని దీంతో అప్పటికప్పుడు జైట్లీ, వెంకయ్యలు విదేశాల్లో ఉన్న మోదీతో మాట్లాడి ప్రకటన కోసం అనుమతి తీసుకున్నారని రాసుకొచ్చింది. అయినా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తే మోదీ దిగివచ్చేంత సీన్ ఉందా? అన్నది కాసేపు పక్కన పెడుదాం. అంటే మంగళవారం కేబినెట్‌ భేటీలో ప్యాకేజ్ రూపంలో ఇచ్చింది తీసుకుందామని చంద్రబాబే స్వయంగా చెప్పారు. అయితే ఉదయం పత్రికలు చూసిన విపక్షాలు, జనం ఆగ్రహం వ్యక్తం చేసే సరికి బాబు గారు రూటు మార్చారు. హోదా కోసమే చంద్రబాబు భీష్మించుకుని విజయవాడలో కూర్చున్నారని అవే బాబుగారి టీవీలు తెగ హడావుడి చేశాయి. ఎవరో తపస్సు చేస్తే మరేవడో వచ్చి వరం అడిగినట్టు దశాబ్దాలుగా విశాఖ రైల్వే జోన్‌ కోసం ఉత్తరాంధ్ర వాసులు పోరాడుతుంటే దాన్ని కూడా విజయవాడకు తరలించేందుకు చంద్రబాబు అండ్ కంపెనీ ప్రయత్నించింది. ఒడిషా పేరు చెప్పి అత్తగారి జిల్లాకు జోన్ తరలించేందుకు వ్యూహ రచన చేశారు. దీనిపై ఉత్తరాంద్రలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అప్పటికప్పుడు చంద్రబాబు రైల్వే జోన్‌ పైనా మాట మార్చేశారు.

ఎవరు అభ్యంతరం చెప్పినా రైల్వే జోన్‌ విశాఖకే ఇవ్వాలని బాబు డిమాండ్ చేశారంటూ ఆయన అనుకూల టీవీ ఛానళ్లు మరికాసేపు హడావుడి చేశాయి. మొత్తం మీద చంద్రబాబు, ఆయన మీడియా చేసిన విన్యాసాలు చూస్తే కొన్ని విషయాలు ఈజీగా అర్థమైపోతాయి. ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్‌కు చంద్రబాబు ఇది వరకే అంగీకరించారన్నది సుస్పష్టం. విభజనను అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు పోరాడామని అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు నమ్మించినట్టుగానే … హోదా కోసం ఆఖరి నిమిషం వరకు ఫైట్ చేశామని నమ్మించి జనాన్ని పిచ్చివాళ్లను చేసేందుకే చంద్రబాబు నాటకం ఆడుతున్నది నిజం. ఉత్తరాంధ్ర ప్రజల ఆశల కన్నా తన అత్తారింటికి రైల్వే జోన్‌ తరలించడమే చంద్రబాబుకు ముఖ్యమని అర్థమవుతోంది. కేంద్రం ప్యాకేజ్‌ ప్రకటించిన తర్వాత చంద్రబాబు ఏం చేస్తారో కూడా ఒక అంచనా వేయవచ్చు. ప్యాకేజ్‌పై విపక్షాలు, ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోతే తన పోరాటం వల్లే భారీ ప్యాకేజ్ వచ్చిందని బాకా ఊదుకుంటారు. ఒకవేళ ప్యాకేజ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే మాత్రం … నిందను కేంద్రంపై నెట్టేస్తారు. చంద్రబాబు నుంచి ఇంతకు మించి నిజాయితీ రాజకీయం ఎక్స్‌ఫెక్ట్ చేయడం కూడా దురాశే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News