నాగచైతన్య వివాహంపై ప్రెస్‌మీట్‌లో స్పందించిన నాగార్జున

నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా సమంత, నాగచైతన్య కలిసే పబ్లిక్‌గా తిరుగుతున్నారు. ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి వివాహానికి కూడా సమంత, చైతన్య ఇద్దరూ భార్యాభర్తల తరహాలో వచ్చారు. పెళ్లికి వచ్చిన వీఐపీలకు సమంత, నాగచైతన్య జంటను నాగార్జున పరిచయం చేశారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన నాగార్జున… కొడుకుల పెళ్లిళ్లపై స్పందించారు. త్వరలోనే నాగచైతన్య, అఖిల్ వివాహాలపై ప్రకటన చేస్తామన్నారు. […]

Advertisement
Update: 2016-09-05 08:23 GMT

నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకోబోతున్నారని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా సమంత, నాగచైతన్య కలిసే పబ్లిక్‌గా తిరుగుతున్నారు. ఇటీవల నిమ్మగడ్డ ప్రసాద్ కూతురి వివాహానికి కూడా సమంత, చైతన్య ఇద్దరూ భార్యాభర్తల తరహాలో వచ్చారు. పెళ్లికి వచ్చిన వీఐపీలకు సమంత, నాగచైతన్య జంటను నాగార్జున పరిచయం చేశారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన నాగార్జున… కొడుకుల పెళ్లిళ్లపై స్పందించారు. త్వరలోనే నాగచైతన్య, అఖిల్ వివాహాలపై ప్రకటన చేస్తామన్నారు. ఒక మంచి టైమింగ్ చూసి ప్రకటన చేస్తామన్నారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్‌ను ప్రేమిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News