మళ్లీ నోటీసులు... చంద్రబాబుది భయమా?. ప్రతీకారమా?

తనపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీకోర్టును ఆశ్రయించి విచారణకు ఉత్తర్వులు తేవడం చంద్రబాబుకు బాగానే మండేలా చేసినట్టుగా ఉంది. ప్రతీకారం తరహాలో దాడులకు సిద్ధమయ్యారు. శుక్రవారం భూమన కరుణాకర్‌ రెడ్డికి తుని కేసులో నోటీసులు పంపిన చంద్రబాబు ప్రభుత్వం… ఇప్పుడు మరోసారి సాక్షిని టార్గెట్ చేసింది. అమరావతిలో భూఅక్రమాలపై కథనాలు రాసిన సాక్షికి నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సాక్షి కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. రాజధాని వార్తలు రాసిన జర్నలిస్టులు విచారణకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. అయితే ఇక్కడ […]

Advertisement
Update: 2016-09-03 11:31 GMT

తనపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీకోర్టును ఆశ్రయించి విచారణకు ఉత్తర్వులు తేవడం చంద్రబాబుకు బాగానే మండేలా చేసినట్టుగా ఉంది. ప్రతీకారం తరహాలో దాడులకు సిద్ధమయ్యారు. శుక్రవారం భూమన కరుణాకర్‌ రెడ్డికి తుని కేసులో నోటీసులు పంపిన చంద్రబాబు ప్రభుత్వం… ఇప్పుడు మరోసారి సాక్షిని టార్గెట్ చేసింది. అమరావతిలో భూఅక్రమాలపై కథనాలు రాసిన సాక్షికి నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సాక్షి కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. రాజధాని వార్తలు రాసిన జర్నలిస్టులు విచారణకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కోర్టు ద్వారా కాకుండా నేరుగా పోలీసుల ముందే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు.

ఇది వరకు కూడా రాజధాని కథనాలపై సాక్షికి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు పంపారు. అయితే సాక్షి మీడియా హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చర్యలు నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి సాక్షికి పోలీసులు నోటీసులు పంపడం ఆసక్తికరంగానే ఉంది. ఇది ముమ్మాటికీ ఓటుకు నోటు కేసులో వైసీపీ తీరుకు ప్రతీకారంగానే భూమనకు, సాక్షికి నోటీసులు ఇస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయినా రెండు ప్రధాన పత్రికలు, దాదాపు 13 టీవీ ఛానళ్లు టీడీపీకి మద్దతుగా కృషి చేస్తున్నప్పటికీ కూడా ఒక్క సాక్షి కథనాలకు చంద్రబాబు ఈ రేంజ్‌లో స్పందించడం విచిత్రమే. తనకు వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా వినిపించకూడదన్నది చంద్రబాబు ఆలోచన కాబోలు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News