చంద్రబాబుకు ఊరట

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్టే సంపాదించారు. ఏసీపీ విచారణపై స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసు విషయంలో సవివరంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసే వరకు ఏసీబీ విచారణపై స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొలుత వాదనలు వినిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టు అడ్డుకోజాలదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు […]

Advertisement
Update: 2016-09-02 00:36 GMT

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్టే సంపాదించారు. ఏసీపీ విచారణపై స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసు విషయంలో సవివరంగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసే వరకు ఏసీబీ విచారణపై స్టే ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తొలుత వాదనలు వినిపించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తరపు న్యాయవాది సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టు అడ్డుకోజాలదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పులున్నాయన్నారు. సెక్షన్ 156 ఆర్డర్‌పై స్టే అడితే హక్కు చంద్రబాబుకు లేదని వాదించారు. కానీ సుధాకర్ రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. 8వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశించింది. అప్పటి వరకు విచారణపై స్టే ఇస్తున్నట్టు వెల్లడించింది.

తనపై విచారణకు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ గురువారం చంద్రబాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ ను కొనేందుకు డబ్బులు ఇచ్చిన వ్యవహారం అవినీతినిరోధక చట్టం పరిధిలోకి రాదని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చెప్పారు. ఈ కోణంలోనే స్టే తెచ్చుకునేందుకు చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం పిటిషన్ ను విచారించిన కోర్టు ఏసీబీ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది.

14 నెలల క్రితం ఓటుకు కోట్లు ఇస్తూ రేవంత్ రెడ్డి ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయారు. అనంతరం చంద్రబాబు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. తొలుత కేసు విషయంలో తెగ హడావుడి చేసిన కేసీఆర్ ప్రభుత్వం అనంతరం సైలెట్ అయిపోయింది. చంద్రబాబు, కేసీఆర్ రాజీ పడ్డారన్న విమర్శలు వచ్చాయి. ఇంతలోనే రెండు రోజుల క్రితం ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్దారించిన నివేదికను ఏసీబీకి కోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమర్పించారు. వెంటనే చంద్రబాబుపై విచారణకు ఆదేశించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 29లోగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రను తేల్చాలని ఏసీబీని ఆదేశించింది. దీంతో టీడీపీలో కలకలం రేగింది. ఇంతలోనే చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News