బోండా ఉమా కొత్త కర్చీఫ్‌ రెడీ చేసుకుంటున్నారా?

ఎమ్మెల్యే బోండా ఉమా తీరుపై టీడీపీలో చర్చమొదలైంది. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో బోండా ఉమా వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పవన్‌ బర్త్‌ డే సందర్బంగా నగరంలో భారీగా బోండా ఉమ వర్గం ఫ్లెక్సీలను పెట్టించారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో పవన్‌, బోండా ఉమా బొమ్మలు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బొమ్మగానీ, టీడీపీ లోగోగానీ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్, చంద్రబాబు, టీడీపీని విస్మరించి […]

Advertisement
Update: 2016-09-02 02:30 GMT

ఎమ్మెల్యే బోండా ఉమా తీరుపై టీడీపీలో చర్చమొదలైంది. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో బోండా ఉమా వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పవన్‌ బర్త్‌ డే సందర్బంగా నగరంలో భారీగా బోండా ఉమ వర్గం ఫ్లెక్సీలను పెట్టించారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో పవన్‌, బోండా ఉమా బొమ్మలు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బొమ్మగానీ, టీడీపీ లోగోగానీ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది.

ఎన్టీఆర్, చంద్రబాబు, టీడీపీని విస్మరించి ఫ్లెక్సీలపై కేవలం పవన్ కల్యాణ్ బొమ్మ మాత్రమే బోండా ఉమా వేయించుకోవడం వెనుక ఆంతర్యామేమిటని చర్చించుకుంటున్నారు. పైగా ఫ్లెక్సీలపై జనసేన సింబల్ కూడా ఉంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన సామాజిక వర్గానికే చెందిన పవన్ పై బోండా ఉమా ఆశలు పెట్టుకున్నారా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్లెక్సీల విషయంలోనే కాదు.. ఇటీవల తిరుపతి సభలో పవన్‌ కల్యాణ్‌ తమను దూషించడంపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ తీవ్రంగా స్పందించారు. పవన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అయితే టీడీపీ ఎంపీలను పవన్ తిట్టినప్పుడు మౌనంగా ఉన్న ఉమా… అదే ఎంపీలు పవన్‌కు కౌంటర్ ఇవ్వగానే తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. పవన్‌ను విమర్శిస్తే మంచిగా ఉండదని టీజీ వెంకటేష్‌ను ఉమా హెచ్చరించారు. టీజీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ సంస్కృతిని టీడీపీలో చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ విషయంలో పార్టీ ఒక వైఖరితో ఉందని దానికి కట్టుబడి ఉండాలని టీజీకి హితవు పలికారు ఉమా. మొత్తం మీద పవన్‌ విషయంలో బోండా ఉమా చూపుతున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఎంతదూరం వెళ్తుందో!.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News