ఓటుకు నోటుపై సోమిరెడ్డి కొత్త వాదన

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర తేల్చాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కోర్టుల తీరును తప్పుపట్టారు. కోర్టు పరిధి దాటకూడదన్నారు. చార్జీషీట్‌లో చంద్రబాబు పేరే లేనప్పుడు ఆయనపై విచారణకు కోర్టు ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలన్నారు. ఓటుకు నోటు కేసు ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ గానే పరిగణించాలన్నారు. కానీ కేసీఆర్‌ అవినీతి బయటపెట్టారనే కారణంతోనే రేవంత్‌రెడ్డిని ప్రివెన్షన్ ఆఫ్ […]

Advertisement
Update: 2016-08-31 11:56 GMT

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర తేల్చాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కోర్టుల తీరును తప్పుపట్టారు. కోర్టు పరిధి దాటకూడదన్నారు. చార్జీషీట్‌లో చంద్రబాబు పేరే లేనప్పుడు ఆయనపై విచారణకు కోర్టు ఎలా ఆదేశిస్తుందని ప్రశ్నించారు. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలన్నారు. ఓటుకు నోటు కేసు ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీసెస్ గానే పరిగణించాలన్నారు. కానీ కేసీఆర్‌ అవినీతి బయటపెట్టారనే కారణంతోనే రేవంత్‌రెడ్డిని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం సెక్షన్ 12 కింద జైలుకు పంపారని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా నగదుతో కొందరు పట్టబడితే సెక్షన్ 171 కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారని సోమిరెడ్డి చెప్పారు. మత్తయ్య పిటిషన్‌ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఏసీబీ కోర్టు విచారణకు ఎలా ఆదేశిస్తుందని సోమిరెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానం పరిధి దాటడం మంచిది కాదన్నారు. జాతికి, కులానికి తేడా తెలియని ముద్రగడ రాష్ట్రంలో కులచిచ్చు రేపుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News