పవన్‌ సభకు వచ్చింది వారేనా!- ప్రముఖ పత్రిక కథనం

పవన్‌ కల్యాణ్ తిరుపతి సభకు సంబంధించిన ఒక తెలుగు దినపత్రిక( జగన్‌, చంద్రబాబుల అనుకూల పత్రికలు కాదు) ఆసక్తికమైన కథనాన్ని ప్రచురించింది. సభకు వచ్చిన వారి గురించి, సభ జరిగిన తీరు గురించి కథనం రాసింది. తనకు కులాలు, మతాలు లేవని, అలా ఎవరైనా అంటే తనకు కోపం నషాళానికి అంటుందని పవన్ చెప్పినప్పటికీ … సభకు వచ్చిన వారితో మెజారిటీ వారంతా కాపు సామాజికవర్గం వారేనని సదరు పత్రిక ప్రముఖంగా కథనం రాసింది. పైగా ముద్రగడ దీక్షకు, మందకృష్ణ […]

Advertisement
Update: 2016-08-27 23:12 GMT

పవన్‌ కల్యాణ్ తిరుపతి సభకు సంబంధించిన ఒక తెలుగు దినపత్రిక( జగన్‌, చంద్రబాబుల అనుకూల పత్రికలు కాదు) ఆసక్తికమైన కథనాన్ని ప్రచురించింది. సభకు వచ్చిన వారి గురించి, సభ జరిగిన తీరు గురించి కథనం రాసింది. తనకు కులాలు, మతాలు లేవని, అలా ఎవరైనా అంటే తనకు కోపం నషాళానికి అంటుందని పవన్ చెప్పినప్పటికీ … సభకు వచ్చిన వారితో మెజారిటీ వారంతా కాపు సామాజికవర్గం వారేనని సదరు పత్రిక ప్రముఖంగా కథనం రాసింది. పైగా ముద్రగడ దీక్షకు, మందకృష్ణ మాదిగ సభకు అనుమతి నిరాకిరించిన ప్రభుత్వం … జనసేన సభకు మాత్రం దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇవ్వడాన్ని పత్రిక ఎత్తిచూపింది. అధికార పార్టీ సౌజన్యంతోనే సభ నిర్వహించారని వెల్లడించింది. “చంద్రబాబుకు డప్పులు… బీజేపీపై నిప్పులు” అన్న హెడ్‌లైన్‌తో కథనం ప్రచురించింది. సభలో ప్రధానంగా మూడు అంశాలు మాట్లాడుతానని పవన్ చెప్పారు. కానీ మూడు అంశాల్లో ఒకటైన టీడీపీ పరిపాలన తీరుతెన్నుల గురించి పూర్తి ప్రసంగంలో మాత్రం పవన్ ప్రస్తావించలేదని ఎత్తి చూపింది. పవన్ సభకు వచ్చిన వారిలో మైనర్ యువకులు కూడా ఉండడం విశేషం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News