సినిమా చూస్తూ ఆ మాట‌న్నాడు...దుర‌దృష్టం వెంటాడి అదే నిజ‌మైంది!

సాధార‌ణంగా పిల్ల‌ల కోరిక‌లు తీర్చ‌డం త‌ల్లిదండ్రుల‌కు ఆనందంగా ఉంటుంది. కానీ అవినాష్ అనే 12ఏళ్ల బాలుడి కోరిక తీరుస్తూ ఆ త‌ల్లిదండ్రులు గుండెలు ప‌గిలేలా రోదించారు. ఎందుకంటే …యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌డెడ్ అయిన అవినాష్ అవ‌య‌వాల‌ను దానం చేయ‌డానికి అంగీక‌రించ‌మే…వాళ్లు తీర్చిన కుమారుని కోరిక‌. అవినాష్ కుటుంబం తమిళ‌నాడు, నాగ‌ర్‌కొయిల్‌లోని కొట్టార్ ప్రాంతానికి చెందిన వారు. కొన్నివారాల క్రితం అవినాష్ త‌న తండ్రి స్వామినాథ‌న్‌, త‌ల్లి ల‌త‌, సోద‌రి ఉత్త‌ర‌ల‌తో క‌లిసి చెన్నాయిల్ ఒరునాయిల్… అనే సినిమా చూశాడు. […]

Advertisement
Update: 2016-08-26 03:41 GMT

సాధార‌ణంగా పిల్ల‌ల కోరిక‌లు తీర్చ‌డం త‌ల్లిదండ్రుల‌కు ఆనందంగా ఉంటుంది. కానీ అవినాష్ అనే 12ఏళ్ల బాలుడి కోరిక తీరుస్తూ ఆ త‌ల్లిదండ్రులు గుండెలు ప‌గిలేలా రోదించారు. ఎందుకంటే …యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌డెడ్ అయిన అవినాష్ అవ‌య‌వాల‌ను దానం చేయ‌డానికి అంగీక‌రించ‌మే…వాళ్లు తీర్చిన కుమారుని కోరిక‌.

అవినాష్ కుటుంబం తమిళ‌నాడు, నాగ‌ర్‌కొయిల్‌లోని కొట్టార్ ప్రాంతానికి చెందిన వారు. కొన్నివారాల క్రితం అవినాష్ త‌న తండ్రి స్వామినాథ‌న్‌, త‌ల్లి ల‌త‌, సోద‌రి ఉత్త‌ర‌ల‌తో క‌లిసి చెన్నాయిల్ ఒరునాయిల్… అనే సినిమా చూశాడు. ఆ సినిమా అవినాష్‌కి బాగా న‌చ్చింది. అది అవ‌య‌వ దానం గొప్ప‌త‌నాన్ని వెల్ల‌డిస్తూ తీసిన సినిమా. ఆ సినిమాని చూశాక అవినాష్ త‌న తండ్రితో… త‌న‌కేదైనా జ‌రిగితే త‌న అవ‌య‌వాల‌ను దానం చేయాల్సిందిగా చెప్పాడు. కొడుకు మాట‌ల‌కు విప‌రీత‌మైన బాధ, కోపం రాగా…స్వామినాథ‌న్ అవినాష్‌ని రెండు దెబ్బ‌లు వేసి…ఇంకెప్పుడూ అలా మాట్లాడ‌కు…అని గ‌ట్టిగా హెచ్చ‌రించాడు.

అయితే అవినాష్ మాట‌లు నిజ‌మయ్యాయి. అత‌డిని దుర‌దృష్టం యాక్సిడెంట్ రూపంలో వెంటాడింది. గురువారం అవినాష్ బ్రెయిన్ డెడ్ అయిన‌ట్టుగా డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. ఆ సంద‌ర్భంలో కొడుకు మాట‌లు గుర్తుకురాగా….అత‌ని పెద్ద మ‌న‌సు ఆ త‌ల్లిదండ్రుల్లో మ‌రింత దుఃఖాన్ని నింపింది. క‌ట్ట‌లు తెంచుకుంటున్న క‌న్నీళ్ల‌తోనే వారు కొడుకు కోరిక‌ని తీర్చ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. అత‌ని అవ‌య‌వాల‌ను దానం చేసి కొంతమందికి పున‌ర్జ‌న్మ‌ని ఇవ్వ‌డానికి ముందుకొచ్చారు. అవినాష్ ఎంతో చురుగ్గా ఉండేవాడ‌ని, ఎప్పుడూ ఇత‌రుల‌కు స‌హాయం చేసేవాడ‌ని… వారు కొడుకు మంచిత‌నాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేసుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News