వెలగపూడి సచివాలయంలో మొదలైన కూల్చివేతలు

తాత్కాలిక రాజధానిలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు చెట్ల కింద కూర్చోనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని భీకర గర్జనలు చేసిన టీడీపీ నాయకులు… ఇప్పుడు మంత్రుల హోదాలో తాత్కాలిక నిర్మాణాలను తిరస్కరించారు. మంత్రులైన తాము ఇలాంటి ఇరుకు గదుల్లో ఉండడం ఏమిటని మొండికేసే సరికి ఇప్పుడు కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గోడలకు సిమెంట్ కూడా ఆరకముందే కూల్చివేస్తున్నారు. చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని మంత్రులు అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో శనివారం నుంచి తాత్కాలిక రాజధానిలోని చాంబర్ల గోడలను […]

Advertisement
Update: 2016-08-19 23:24 GMT

తాత్కాలిక రాజధానిలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు చెట్ల కింద కూర్చోనైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని భీకర గర్జనలు చేసిన టీడీపీ నాయకులు… ఇప్పుడు మంత్రుల హోదాలో తాత్కాలిక నిర్మాణాలను తిరస్కరించారు. మంత్రులైన తాము ఇలాంటి ఇరుకు గదుల్లో ఉండడం ఏమిటని మొండికేసే సరికి ఇప్పుడు కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గోడలకు సిమెంట్ కూడా ఆరకముందే కూల్చివేస్తున్నారు. చాంబర్లు ఇరుకుగా ఉన్నాయని మంత్రులు అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో శనివారం నుంచి తాత్కాలిక రాజధానిలోని చాంబర్ల గోడలను కూల్చివేస్తున్నారు. గోడలు కూల్చి మంత్రుల చాంబర్ల విస్తీర్ణం పెంచుతున్నారు. రెండో బ్లాక్, ఐదో బ్లాక్‌లోని మంత్రుల పెషీలను కూల్చివేస్తున్నారు. ఒక్కో చాంబర్‌కు అదనంగా 200 గజాలు విస్తీర్ణం పెంచుతున్నారు. కొన్ని చాంబర్లు ఇరుకుగా లేనప్పటికి పలువురు మంత్రులు వాస్తు లోపాలను ఎత్తిచూపారు. దీంతో వాటిని కూడా కూల్చి వాస్తు వైద్యం చేస్తున్నారు.

జూన్‌ 27న సచివాలయం ప్రారంభమైందని ప్రభుత్వం హడావుడి చేసినప్పటికీ ఆ తర్వాత వెలగపూడి వైపు మంత్రులు గానీ, అధికారులు గానీ కన్నెత్తి చూడలేదు. కేవలం డెడ్‌లైన్‌లోపు రాజధాని నిర్మించామని చెప్పుకోవాలన్న తాపత్రయంతో టాయ్‌లెట్లు కూడా నిర్మించకుండానే ఉద్యోగులను తరలించడంతో వ్యవహారం మొదటికి వచ్చింది. ఇప్పుడు మంత్రుల పెషీల మెరుగుకు కోట్లాది రూపాయలు అదనంగా ఖర్చు అవుతోంది. ఎన్నికల ముందు చెట్ల కింద కూర్చుని పాలన సాగిస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు అండ్ టీం వాస్తవానికి మాత్రం ఇలా చాంబర్ల సైజు కోసం పాకులాడుతోంది. అయినా చాంబర్లు పూర్తయ్యే సరికి సగం పుణ్యకాలం గడిచిపోయేలాగే ఉంది. ముచ్చటపడి మరమ్మతులు చేయించుకుంటున్న చాంబర్లు భవిష్యత్తులో అనుభవించేవారు ఎవరో?. చాంబర్లు ఇంత ఇరుకుగా ఉండడానికి మంత్రి నారాయణే కారణమని మంత్రులు మండిపడడమే కాకుండా చంద్రబాబుకు కూడా నారాయణపై ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా సన్నిహితులవద్ద “నారాయణ మిగిలిన మంత్రులను వాళ్ల కాలేజీలో ఉద్యోగులుగా భావించినట్లున్నాడు, అందుకే పిచ్చుక గూళ్లు లాంటి చాంబర్లు కట్టాడు, లక్షలకు లక్షల ఫీజులు తీసుకుని సరైన టాయిలెట్స్ కూడా లేని హాస్టళ్లు కట్టినట్టు ఈ చాంబర్లు ఎమిటి? ” అని మాట్లాడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News