కృష్ణపై చంద్రబాబు ఆన... ఏం జరుగుతుందో?

చంద్రబాబు మరో ఆన చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రభుత్వ పోరాటస్పూర్తిని ప్రజలందరూ గమనిస్తున్న వేళ చంద్రబాబు కృష్ణమ్మపై ఒట్టు వేశారు. కృష్ణా పుష్కరాల హారతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎప్పటిలాగే మైక్ అందుకుని సంకల్పం పేరుతో దంచేశారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోవాలని బీజేపీకి సూచించారు. డబ్బులు లేకున్నా సరే పేదలకు న్యాయం చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదన్నారు. హోదాను కృష్ణమ్మ సాక్షిగా పోరాడి సాధించుకుంటామని శపథం చేశారు. వెనక్కు వెళ్లే […]

Advertisement
Update: 2016-08-19 22:22 GMT

చంద్రబాబు మరో ఆన చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రభుత్వ పోరాటస్పూర్తిని ప్రజలందరూ గమనిస్తున్న వేళ చంద్రబాబు కృష్ణమ్మపై ఒట్టు వేశారు. కృష్ణా పుష్కరాల హారతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఎప్పటిలాగే మైక్ అందుకుని సంకల్పం పేరుతో దంచేశారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోవాలని బీజేపీకి సూచించారు. డబ్బులు లేకున్నా సరే పేదలకు న్యాయం చేయడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదన్నారు. హోదాను కృష్ణమ్మ సాక్షిగా పోరాడి సాధించుకుంటామని శపథం చేశారు. వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. హోదా విషయంలో చంద్రబాబు పోరాటం, బీజేపీ ఆరాటం ఎలా ఉన్నాయో అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. అసలు హోదాపై రోజురోజుకు ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ఇలాంటి సమయంలో జనానికి అన్నం పెడుతున్న కృష్ణమ్మపై ఒట్టు వేయడం అవసరమా?. అని భక్తులు వాపోతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News