చుట్టాలబ్బాయికి వార్నింగ్

నటుడు సాయి కుమార్, ఆయన కొడుకు కలిసి నటించిన చుట్టాలబ్బాయి చిత్రంపై రెడ్డి సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా సినిమాలో హీరో ఆది చెప్పిన డైలాగులపై రెడ్డి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న డైలాగులపై ఇది వరకే హీరో ఆది దృష్టికి కొందరు అభిమానులు తీసుకెళ్లారు. ఇందుకు ఫేస్ బుక్‌లో స్పందించిన ఆది… ఆ డైలాగులను తొలగించామని చెప్పారు.  రెడ్డి సామాజికవర్గంపైనా తనకు గౌరవం […]

Advertisement
Update: 2016-08-18 23:32 GMT

నటుడు సాయి కుమార్, ఆయన కొడుకు కలిసి నటించిన చుట్టాలబ్బాయి చిత్రంపై రెడ్డి సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా సినిమాలో హీరో ఆది చెప్పిన డైలాగులపై రెడ్డి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న డైలాగులపై ఇది వరకే హీరో ఆది దృష్టికి కొందరు అభిమానులు తీసుకెళ్లారు. ఇందుకు ఫేస్ బుక్‌లో స్పందించిన ఆది… ఆ డైలాగులను తొలగించామని చెప్పారు. రెడ్డి సామాజికవర్గంపైనా తనకు గౌరవం ఉందని చెప్పారు. ఒకవేళ సినిమాలో ఆ డైలాగులు ఉంటే మాత్రం చిత్రాన్ని అడ్డుకుంటామని రెడ్డి సంఘాల నేతలు హెచ్చరించారు. శుక్రవారమే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వీరభద్రమ్ చౌదరి కావాలనే రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా డైలాగులు రాయించారని చెబుతున్నారు.

సాయికుమార్‌పై తమకు చాలా గౌరవం ఉందని దాన్ని పోగొట్టుకోవద్దని రెడ్డి సంఘాల నేతలు కోరారు. అయితే వేలంవెర్రిలా మారిన సినిమావాళ్లు ఇలాంటి సుతిమెత్తని విజ్ఞప్తులతో మంచి బుద్ది తెంచుకుంటారా అంటే గత అనుభవాలను పరిశీలిస్తే అనుమానమే. బ్రహ్మణులను, రెడ్లను, యాదవులను, గౌడ్, ముస్లింలు ఇలా ఏదో ఒక వర్గాన్ని కించపరచకుండా సినిమాలు తీయలేని దుస్థితికి తెలుగు చిత్రపరిశ్రమ దిగజారి చాలా కాలమే అయింది మరి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News