జేసీకి కూడా కుల ఇబ్బందులు తప్పడం లేదా?

అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయాల గురించి ఒక మీడియాలో వచ్చిన కథనం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో టీడీపీ నాయకులు కులరాజకీయాలు చేయడంతో పాటు… ఏకంగా కమ్మభవన్ నే కార్యక్రమాలకు వాడుతున్న విధానాన్ని సదరు కథనం వివరించింది. టీడీపీతో పాటు ప్రభుత్యానికి సంబంధించిన ఏ మీటింగ్‌ అయినా అనంతపురంలోని కమ్మభవన్ నే వేదికగా మారుస్తున్నారట. మిగిలిన కులాల నాయకులు కూడా ఇక్కడికి రావాల్సిందే. తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం కూడా కమ్మభవన్లోనే ఏర్పాటు చేశారని […]

Advertisement
Update: 2016-08-14 23:51 GMT

అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయాల గురించి ఒక మీడియాలో వచ్చిన కథనం ఆసక్తికరంగా ఉంది. జిల్లాలో టీడీపీ నాయకులు కులరాజకీయాలు చేయడంతో పాటు… ఏకంగా కమ్మభవన్ నే కార్యక్రమాలకు వాడుతున్న విధానాన్ని సదరు కథనం వివరించింది. టీడీపీతో పాటు ప్రభుత్యానికి సంబంధించిన ఏ మీటింగ్‌ అయినా అనంతపురంలోని కమ్మభవన్ నే వేదికగా మారుస్తున్నారట. మిగిలిన కులాల నాయకులు కూడా ఇక్కడికి రావాల్సిందే. తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం కూడా కమ్మభవన్లోనే ఏర్పాటు చేశారని మీడియా సంస్థ కథనం. అనంతపురం జిల్లాలో నిజానికి కమ్మసామాజికవర్గ జనాభా మూడు నాలుగు శాతం మాత్రమే. ఆ పార్టీ అధికారంలోకి వస్తే పదవులు అనుభవించే వారిలో ఆ సామాజికవర్గం వారే అధికంగా ఉంటారు. ప్రస్తుతం జిల్లా మంత్రి పరిటాల సునీతతో పాటు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కృష్ణా జిల్లాకు చెందినప్పటి హిందూపురం నుంచి గెలిచిన హీరో బాలకృష్ణ, కల్యాణదుర్గం ఎమ్మెల్యే వీరంతా కమ్మసామాజికవర్గానికి చెందిన వారే. నగర కార్పొరేషన్ చైర్‌పర్సన్ కూడా ఆ సామాజివకర్గానికి చెందిన వారే. అయితే జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం బీసీలే. కానీ వారికి పదవుల విషయంలో మాత్రం పెద్దగా అవకాశాలుండవట. టీడీపీ మీటింగ్‌లన్నింటినీ కమ్మభవన్‌లోపెట్టడంపై పార్టీలోనే కొందరు పెదవి విరుస్తున్నారట. తాము పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చినట్టుగా లేదని కుల సమావేశానికి వచ్చినట్టుగా ఉంటోందని నేతలు వాపోతున్నారట. కాంగ్రెస్‌లో జిల్లా కింగ్‌లా బతికిన జేసీ దివాకర్ రెడ్డిలాంటి వారికికూడా ఈ కమ్మభవన్ ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. అయితే పార్టీ నాయకత్వం మొత్తం సదరు సామాజికవర్గం చేతిలోనే ఉండడంతో ఈ విషయంపై తమ అభ్యంతరాన్ని కూడా బహిర్గతం చేయలేక మిగిలిన వర్గాల వారు మౌనంగా ఉండిపోతున్నారట. నగరంలో అనేక ఫంక్షన్ హాళ్లు ఉన్నా ఇలా ఒక కుల భవన్లో మీటింగ్‌లు పెట్టడం ద్వారా పార్టీకి చెడే ఎక్కువగా జరుగుతోందన్న భావన వ్యక్తమవుతోందంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News