సౌందర్యనూ వదిలిపెట్టలేదా?
గ్యాంగ్ స్టర్ నయీం, పోలీసులు కలిసి ఆడిన దుర్మార్గపు దొంగాపోలీస్ ఆటలో బాధితులు అన్ని వర్గాలు వారు ఉన్నట్టుగా తేలుతోంది. తాజాగా నయీం డైరీలోని మరికొన్ని కీలక విషయాలు మీడియాకు పొక్కాయి. అందులో ప్రముఖ నటికి చెందిన భూమి కబ్జా అంశం కూడా వెలుగు చూసింది. కొన్నేళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన నటీమణికి హైదరాబాద్ నగర శివారులో ఆరు ఎకరాల భూమి ఉండేది. దీన్ని కూడా నయీం గ్యాంగ్ ఆక్రమించింది. నయీంకు అప్పటి […]
గ్యాంగ్ స్టర్ నయీం, పోలీసులు కలిసి ఆడిన దుర్మార్గపు దొంగాపోలీస్ ఆటలో బాధితులు అన్ని వర్గాలు వారు ఉన్నట్టుగా తేలుతోంది. తాజాగా నయీం డైరీలోని మరికొన్ని కీలక విషయాలు మీడియాకు పొక్కాయి. అందులో ప్రముఖ నటికి చెందిన భూమి కబ్జా అంశం కూడా వెలుగు చూసింది. కొన్నేళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన నటీమణికి హైదరాబాద్ నగర శివారులో ఆరు ఎకరాల భూమి ఉండేది. దీన్ని కూడా నయీం గ్యాంగ్ ఆక్రమించింది. నయీంకు అప్పటి ఎస్‌ఐ ప్రస్తుతం సీఐగా పనిచేస్తున్న వ్యక్తి సహకరించారని తేలింది. ఈ లోఫర్ పనికి సహకరించిన సదరు సీఐగారికి నయీం ఒక ప్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే నయీంకు భయపడి సదరు నటీ కుటుంబసభ్యులు కూడా దీనిపై నోరు మెదపలేదు.
ఏపీ సీఆర్‌డీఏ పరిధిలో వందల కోట్ల విలువైన దందాలను నయీం నడిపాడు. ఇందుకు ఏపీకి చెందిన ఒక కీలక అధికారి అన్నివిధాలుగా సహకరించాడు. అందుకు ప్రతిఫలంగా రూ. 5కోట్లు తీసుకున్నాడు. ఒక ప్రముఖ టీవీ ఛానల్‌లో పనిచేసే కీలక ఉద్యోగి కూడా నయీంతో కలిసి తిరిగాడు. ఒక భూ వివాదాన్ని నయీం దగ్గరకు సదరు టీవీ ఉద్యోగి తీసుకెళ్లారు. ఈ భారీ డీల్‌లో ఛానల్ ఉద్యోగికి సదరు భూ యజమాని రూ. 10కోట్లు ఇచ్చుకున్నాడని నయీం డైరీ ఆధారంగా బయటపడినట్టు తెలుస్తోంది. గతంలో మవోయిస్ట్ డంప్ ను నయీం చెప్పిన ఆచూకీ ఆధారంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డంప్‌లోని కోటిన్నర డబ్బును పోలీసు అధికారులే పంచుకున్నారు. కేవలం ఆయుధాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఇలా ప్రతిచోట , ప్రతి దందాలోనూ పోలీసుల ప్రమేయం ఉండడం డిపార్ట్‌మెంట్‌కే పెద్ద మచ్చగా మారింది. అసలు పోలీస్ శాఖలో ఎవరు మంచివాళ్లు ఎవరు నయీం అనుచరులు అన్నది అంతుపట్టని పరిస్థితి. అయితే ఏపీలో నయీం దందాలు లేవని ఏపీ డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. ఇక్కడ సిట్ వేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ దర్యాప్తుకు సహకరిస్తామన్నారు. అయినా ఏపీలో ఇలాంటి వ్యవహారాలపై విచారణకు ఆదేశిస్తే ఆశ్చర్యపోవాలి గానీ… విచారణ అక్కర్లేదంటే ఆశ్చర్యం ఏముంది?. 30లక్షల కుటుంబాల పొట్టకొట్టిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఏపీ సీఐడీకి అప్పగించి ఎలా నీరు గార్చారో దేశమంతా తెలుసు కదా!.
Click on Image to Read: