ఎక్కడ 20లక్షలు... ఎక్కడ 2.3 లక్షలు! అసలేం జరుగుతోంది?

కుంభమేళాను తలపించేలా కృష్ణ పుష్కరాలను నిర్వహిస్తామన్న చంద్రబాబుకు వస్తున్న భక్తుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గోదావరి పుష్కరాల తరహాలోనే తొలిరోజు పుష్కరాలకు దాదాపు 20లక్షల మంది వస్తారని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసింది. ఆ జనసందోహాన్ని కవర్‌ చేస్తూ చంద్రబాబు పూజలు చేసే దృశ్యాలను షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని దర్శకుడు బోయపాటిని కూడా రంగంలోకి దింపారు. అయితే తీరా తొలిరోజు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబే అవాక్కయ్యారు. ప్రచారం హోరెత్తించినప్పటికీ విజయవాడ ఘాట్ల వద్ద కూడా జనం […]

Advertisement
Update: 2016-08-13 23:39 GMT

కుంభమేళాను తలపించేలా కృష్ణ పుష్కరాలను నిర్వహిస్తామన్న చంద్రబాబుకు వస్తున్న భక్తుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గోదావరి పుష్కరాల తరహాలోనే తొలిరోజు పుష్కరాలకు దాదాపు 20లక్షల మంది వస్తారని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసింది. ఆ జనసందోహాన్ని కవర్‌ చేస్తూ చంద్రబాబు పూజలు చేసే దృశ్యాలను షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని దర్శకుడు బోయపాటిని కూడా రంగంలోకి దింపారు. అయితే తీరా తొలిరోజు వచ్చిన జనాన్ని చూసి చంద్రబాబే అవాక్కయ్యారు. ప్రచారం హోరెత్తించినప్పటికీ విజయవాడ ఘాట్ల వద్ద కూడా జనం చాలా పలుచగా ఉండడంతో తొలిరోజు షార్ట్ ఫిల్మ్‌కు విజువల్ ఫీస్ట్‌ కూడా లేకుండా పోయిందని చెబుతున్నారు. భక్తుల హాజరు దారుణంగా ఉండడంతో కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లిన చంద్రబాబు… అధికారులను పిలిపించి అసహనం వ్యక్తం చేశారు.

తొలిరోజు 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తే కనీసం రెండున్నర లక్షల మంది కూడా రాకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు జిల్లా కలెక్టర్ బాబు నేరుగా పోలీసులపై ఫిర్యాదు చేశారు. లేనిపోని ఆంక్షలు పెట్టడం వల్లే భక్తుల రద్దీ తక్కువగా ఉందంటూ పోలీసులపైకి నెట్టేశారు. అది కూడా డీజీపీ, కమిషనర్ ముందే ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసు బాసులు కూడా వారి వాదనను సీఎంకు వివరించారు. అయితే పాసుల విషయంలో పోలీసు అధికారులకు, కలెక్టర్‌కు మధ్య నడుస్తున్న వివాదం కారణంగానే భక్తుల రద్దీ విషయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారని చెబుతున్నారు. నిజానికి భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉందని సమీక్షలో తేల్చారు. భక్తుల హాజరు శాతం ఇలాగే తక్కువగా ఉంటే పరువు పోతుందని ప్రభుత్వ పెద్దల్లో ఆందోళననెలకొందని సమాచారం.

అందుకే తనకు అనుకూలంగా పనిచేస్తున్న పత్రికల ద్వారా పుష్కరాలు అద్బుతంగా జరుగుతున్నాయని, ఏర్పాట్లు అదిరిపోయాయని ప్రచారం చేయించడం ద్వారా జనాన్ని ఆకర్శించాలని నిర్ణయించారు. అయితే మరికొందరు అధికారులు మాత్రం ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ప్రచారం చేసి మరీ భక్తులను రప్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇష్టమున్న వారు తమంతకు తామే వస్తారు కదా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రచార పిచ్చితో, పుష్కరాలకు రికార్డు స్థాయిలో జనం వచ్చారని చెప్పుకునేందుకు, ఆ దృశ్యాలను షార్ట్‌ ఫిల్మ్‌లు తీసుకోవడం కోసమే ప్రభుత్వం ఇలా దిగజారి వ్యవహరిస్తోందని కొందరు సీనియర్ అధికారులు పెదవి విరుస్తున్నారు. భక్తులు తక్కువగా రావడానికి గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పూజల సమయంలో 30 మంది చనిపోవడం కూడా ఒక కారణమని చెబుతున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News