ఆ విషయంలో మాత్రం ఏపీకి నాలుగో స్థానం

ఏపీలో విద్యావ్యవస్థ బలహీనంగా ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదిక తేల్చింది. ఏటా ప్రాథమిక విద్య కోసం భారీగా కేటాయింపులు చేస్తున్నా … విద్యాబోధనకు అవసరమైన ఉపాధ్యాయులే లేరని కేంద్ర నివేదిక చెబుతోంది. దేశం మొత్తం మీద లక్షా 5వేల 630 పాఠశాలు సింగిల్ టీచర్‌తో నడుస్తున్నాయి. ఒకే టీచర్‌తో నడుస్తున్న పాఠశాలలు మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 17,874 స్కూల్స్లో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌(17,602), రాజస్థాన్(13,575) స్కూళ్లలో ఒక్కో టీచర్ మాత్రమే […]

Advertisement
Update: 2016-08-12 10:21 GMT

ఏపీలో విద్యావ్యవస్థ బలహీనంగా ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదిక తేల్చింది. ఏటా ప్రాథమిక విద్య కోసం భారీగా కేటాయింపులు చేస్తున్నా … విద్యాబోధనకు అవసరమైన ఉపాధ్యాయులే లేరని కేంద్ర నివేదిక చెబుతోంది. దేశం మొత్తం మీద లక్షా 5వేల 630 పాఠశాలు సింగిల్ టీచర్‌తో నడుస్తున్నాయి. ఒకే టీచర్‌తో నడుస్తున్న పాఠశాలలు మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 17,874 స్కూల్స్లో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌(17,602), రాజస్థాన్(13,575) స్కూళ్లలో ఒక్కో టీచర్ మాత్రమే విద్యాబోధన చేస్తున్నారు. ఏపీలోనూ అదే పరిస్థితి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో 9వేల 540 పాఠశాల్లో ఒక్కో టీచర్‌ మాత్రమే ఉన్నారు. ఏపీ తర్వాతి స్థానంలో జార్ఖండ్(7,391) ఉంది. చివరకు బీహార్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఇక్కడ 3,708 స్కూళ్లలో ఒక టీచర్‌ మాత్రమే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 13 స్కూళ్లు ఒక టీచర్‌తో నడుస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News