మాపై నిఘా కాదు... ముందు నయీం డైరీలో ఉన్న ఆ వ్యక్తుల పేర్లు చెప్పండి...

జేఏసీపై ప్ర‌భుత్వం నిఘా పెట్టిందా?  వారి క‌ద‌లిక‌లను  పోలీసులు ఎప్పటిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్నారా? అవున‌నే అంటున్నారు జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడుతున్న త‌మ‌పై పోలీసు నిఘా పెట్టార‌ని జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం  ఆరోపించారు. త‌మ క‌ద‌లిక‌ల‌పై, త‌మ కార్య‌క‌లాపాల‌పై పోలీసులు ర‌హ‌స్యంగా దృష్టిపెడుతున్నారన్నారు. ఈ మేర‌కు త‌మ‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తాము ఎటువంటి సంఘ విద్రోహ‌, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డటం లేద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం పార‌ద‌ర్శ‌కంగానే […]

Advertisement
Update: 2016-08-11 21:00 GMT
జేఏసీపై ప్ర‌భుత్వం నిఘా పెట్టిందా? వారి క‌ద‌లిక‌లను పోలీసులు ఎప్పటిక‌ప్పుడు గ‌మ‌నిస్తున్నారా? అవున‌నే అంటున్నారు జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాడుతున్న త‌మ‌పై పోలీసు నిఘా పెట్టార‌ని జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ఆరోపించారు. త‌మ క‌ద‌లిక‌ల‌పై, త‌మ కార్య‌క‌లాపాల‌పై పోలీసులు ర‌హ‌స్యంగా దృష్టిపెడుతున్నారన్నారు. ఈ మేర‌కు త‌మ‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తాము ఎటువంటి సంఘ విద్రోహ‌, చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డటం లేద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం పార‌ద‌ర్శ‌కంగానే పోరాడుతున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వం కోరితే ఎలాంటి స‌మాచారాన్ని అయినా ఇవ్వ‌డానికి సిద్ధంగానే ఉన్నామ‌న్నారు.
మాలాంటి వారిపై నిఘా పెట్టేముందు గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం డైరీలో ఏముందో వెల్ల‌డించాల‌ని డిమాండ్ చేశారు. అత‌నితో సంబంధం ఉన్న వ్య‌క్తుల పేర్లు వెల్ల‌డించాల‌ని కోరారు. వారు ఎంత‌టి పెద్ద వ్య‌క్తులైనా వ‌ద‌ల‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. న‌యీం వివాదంలో కోదండ‌రామ్ ఎంట‌ర‌వ్వ‌డంతో గులాబీనేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. నిజంగానే డైరీలోని విష‌యాలు బ‌య‌టికి వ‌స్తే.. కొంద‌రు గులాబీనేత‌ల పేర్లు కూడా బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోండ‌ట‌మే ఇందుకు కార‌ణం. త‌మ‌పై నిఘా పెట్టిన ప్ర‌భుత్వానికి కోదండ‌రామ్ ఇలా జ‌ల‌క్ ఇస్తాడ‌ని ఊహించ‌లేక‌పోయారు గులాబీ నేత‌లు. మొత్తానికి న‌యీం వ్య‌వ‌హారంలో కోదండ‌రామ్ మ‌రింత‌గా క‌లుగ‌జేసుకుంటే.. ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌ర‌మే!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News