బాబా మజాకా... అమరావతి పిల్ కొట్టివేత

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై మరోసారి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. భూ యజమానులు వస్తే అప్పుడు చూద్దామంటూ పిల్‌ను తిరస్కరించింది. అమరావతితో చోటుచేసుకున్న అక్రమాలు, ఉల్లంఘనలపై ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్, జర్నలిస్టు వి.వి.రమణమూర్తి, న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్  పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సిద్ధమవగానే […]

Advertisement
Update: 2016-08-12 08:10 GMT

చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై మరోసారి సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది. రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. భూ యజమానులు వస్తే అప్పుడు చూద్దామంటూ పిల్‌ను తిరస్కరించింది. అమరావతితో చోటుచేసుకున్న అక్రమాలు, ఉల్లంఘనలపై ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్, జర్నలిస్టు వి.వి.రమణమూర్తి, న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సిద్ధమవగానే ప్రధాన న్యాయమూర్తి కల్పించుకున్నారు. మీరు రైతుల తరపున పిటిషన్ వేశారా అని ప్రశ్నించారు. లేదు బాధ్యతాయుతమైన పౌరుడిగా, జర్నలిస్టుగా ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు న్యాయవాది తెలిపారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం… భూ యజమానులు వస్తే అప్పుడు చూద్దామంటూ ప్రకటించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది మరోసారి వాదనలు వినిపించేందుకు ప్రయత్నిస్తూ… కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సింగపూర్ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, ‘ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. సారవంతమైన భూములను రైతులకు ఇష్టం లేకున్నా బలవంతంగా సేకరించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫారసులను పట్టించుకోకుండా సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మిస్తున్నారు..’ అని వివరించబోయారు. అయితే వాదనలు వినేందుకు ప్రధాన న్యాయమూర్తి ఇష్టపడలేదు. వారు రాజధాని నిర్మించాలనుకుంటున్నారు. మీరు అడ్డుకుంటారా అని ప్రశ్నిస్తూ పిల్‌ను చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ కొట్టివేశారు.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News